లాగులగుండీలూడగ బాగులవైలన్నిపెట్టి*వాననుకనుచున్! లాగూజారగపైకని బాగావురికేటిరోజు*బాగా గుర్తే! పోటీపడినురుకుచునే మేటిగనేనేనటంచు*మేఘములందున్! పోటీతత్వమునందున బాటనమదిపులకరింపు*మరువమునెపుడున్! చంకన సంచిని పెట్టుచు వంకరవంకరగనురుకు*వైనముచూడన్! జంకని బాల్యపు నడకలు లెంకగమరికానరావు*లేశమ్మైనన్! సర్కారు బళ్ళ చదువులు ఉర్కే బాల్యంపుదశలు*నుత్సాహమిడున్! మార్కులకైపడిచచ్చెడు తార్కాణపునేటిబళ్ళు*దండుగకాదా? ఓబాల్యమనొకపరిరా వా బడినాడేటిరోజు*బాగుండెనుగా! రాబడికైచదువుటనే డాబడికనిపించదెచట*నరయగజగమున్! ఆటలపాటలబాల్యము మేటిగ మానసముపెంచు*మేదిని లోనన్! మాటికి టీవీ చదువుల మాటున బాల్యమ్మునేడు*మగ్గుచునుండెన్! పోటీ తత్వము పెరిగెను ఘాటగు చదువెల్లదూర* గామిగ మిగిలెన్! నేటిసమాజపుదుష్కృతి కాటికి పోవంగకూడ*కనపడుచుండెన్! గ్రీటింగులుఫైటింగులు ఛీటింగులమధ్యవిద్య*జీవరహితమై! మీటింగులునీటింగులు పాటించనివారుదీన*బాధలనొందున్! - మురళీధర శర్మ మాడుగుల
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
ఉపాధ్యాయుడు!!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
గణనాథా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY
ఆంధ్ర నామ సంగ్రహం ;-సేకరణ : రామానుజం.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి