జీవితాన తొలి హీరో రూపు కదా బాపు తొలి నడకల తీరుతెన్ను చూపు కదా బాపు ఇంటి జనం జవదాటని గీతకు తానొక కేంద్రం పిల్లలకెల్లపుడు తాను ప్రాపు కదా బాపు సంసారం తేరు సాగు ఒడిదుకుల బాటలలో కుదుపులెరుగకుండ నడుపు ఒడుపు కదా బాపు మాటలలోని చదువులు నడకలోన మర్యాదలు పరువు బరువు మోసేందుకు వీపు కదా బాపు అమ్మంటే అనురాగం బాపంటే అధికారం మోహన ఆలన పాలన మూపు కదా బాపు అందరికి పితృదినోత్సవ శుభాకాంక్షలు -రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు