ఇంటిలో సెల్లు లొల్లి 1.కం. పొద్దస్తమాన మనకను హద్దులు మీరుచు తిరిగిన నాగమె బ్రతుకౌ పెద్దల మాటల సతతము బుద్ధిగవినినంత మనకు పూర్ణత గల్గున్ 2 సెల్లే మాలోకమనియు పిల్లలు పనులెల్లమాని విడువక జూడన్ చిల్లులుగమారి భవితయు నల్లరి పాలౌను గదర నందరిలోనన్ 3. పొదుపుగ సెల్లును వాడుచు చదువులలో శ్రద్ధ జూప సాగును నదిలా కొదువనె లేకుండమనకు పదవులు నినుతలుచుకుంటు పరుగున వచ్చున్ 4. చీకటి యందున కూర్చుని సాకులె యమ్మకునుజెప్పి చాటుగా సెల్లున్ జోకులు సొల్లుగ జెప్పగ డోకులుమనముందుజేరు డూడూ బసవా! 5. నెట్టెక్కువ వాడిన ని క్కట్టుల పాలౌదువీవు గమనించంగన్ కట్టడి జేయక పోయిన మట్టిని గరిపించుచుండు మనలందరినిన్ వరుకోలు లక్ష్మయ్య గట్లమల్యాల


కామెంట్‌లు