46. ఉరి తీయండి!పోడుకెళ్ళాలి!!--కేశవరావు తమ్ముడు అపుడపుడు సాంఘిక కథలు , బాలల కథలు రాస్తుండేవాడు.అవి పత్రికలలో వస్తుండేవి. మరొక తమ్ముడు బి.వి.పట్నాయక్ ఇంటర్ మీడియట్ చదువుతుండగానే కథ కోసం కలం పట్డేడు. తెలివైన కోయిల అనే కథను రాసి బాలజ్యోతికి పంపితే అది పిట్టకథ శీర్షిక లో వచ్చింది.1982 మే నెల సంచికలో అది అచ్చయింది.ఇంటర్ రెండవ సంవ త్సరం పరీక్షల య్యాక బాలల కథల కోసం సాధన చేశాడు.యుక్తి కథలు రాయడం తమ్ముడి ప్రత్యేకత. హాయ్ బుజ్జి కథల వరకు ఎదిగాడు. నా తరువాత తమ్ముడు వేణుగోపాలరావు కూడా కవితలు రాసి ఆకాశవాణి లో వినిపించాడు.ఆఖరి తమ్ముడుధనంజయ పట్నాయక్ రాసిన ఒక నాటిక రేడియోలో వచ్చింది. ఇంట్లో సాహిత్య వాతావరణం నెలకొంది. నాకు చాలా ఆనందంకలిగింది. ఒక సారి నేను చినమేరంగి ఊరు వెళ్ళాను.భూషణం మాష్టారి కొండగాలి కథలుపుట్టిన ఊరు చిన మేరంగి.అలాగే తెలుగు కథానిక సాహిత్యం లో తొలి తరం రచయిత గా గుర్తింపబడిన సాంఖ్యాయన శర్మ గారు జమీందారీ కాలంలో దివాను గిరి చేసిన ఊరది.అక్కడ మా అక్క,చెల్లి ఉన్నారు.పెద బావగారు రావుపల్లిశ్రీరామమూర్తి గారు.చిన బావగారు బెహరా రాధాకృష్ణ పాత్రో గారు. ఆయన పెదనాన్న గారు సువర్ణ పాత్రో గారు.పదవీ విరమణ ఉపాధ్యాయులు.ఆయనతో మాట్లాడుతూంటేఎన్నో పాత విషయాలు కదిలేవి.ఆ రోజు బ్రిటిష్ కాలం నాటి సంఘటన చెప్పారు.పార్వతీపురంసెంట్రల్ జైలు లో ఆ సంఘటన జరిగింది. గత భాగాలలో ఆ సెంట్రల్ జైలునే ఉపాధ్యాయ శిక్షణాపాఠశాలగా మార్చారని చెప్పాను.నేడది ప్రభుత్వబాలికోన్నత పాఠశాలగా ఉంది.సువర్ణ పాత్రో మామయ్య గారు చెప్పిన సంఘటనను కథగా మార్చి బాలమిత్ర కు పంపేను.నేరస్తుల అజ్ఞానంపేరుతో 1983 ఫిబ్రవరి సంచికలో వచ్చింది. అదే సంచికలో నేను రాసిన ఫలించిన పన్నాగం అనే కథను కూడా ఇచ్చారు. రెండు కథలు ఒకేసారిఒక పత్రికలో రావడం ఒక ఎత్తయితే దానిని మించినట్టు నేరస్తుల అజ్ఞానం కథ గురించి ఆ సంచిక సంపాదకీయంలో ప్రస్తావించడం మరో ఎత్తయింది!నాకది ప్రోత్సాహమే!ఇక నేరస్తుల అజ్ఞానం కథ లోకి వెళదాం!చాలా చిన్న కథే!బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి!పార్వతీపురం సెంట్రల్ జైలుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు గిరిజనులను తెచ్చారు. ఉరి తీసే ముందు డాక్టర్ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.ఆ గిరిజనులిద్దరు "తొందరగా ఉరి తియ్యండి!మేము పోడు ( వ్యవసాయానికి అనుకూలంగాకొండను సిద్ధం చేయడం)చేసుకోడానికి మా ఊరెళ్ళాలి!"అని డాక్టర్ ని తొందరపెడుతున్నారు.వాళ్ళు మాట్లాడేది కోయభాష! డాక్టర్ గారికి వాళ్ళు అనే మాటలు అర్థం కాలేదు. పక్కనే ఉన్న జైలు అధికారికి ఆ భాష తెలుసు.ఆయన గిరిజనప్రాంతంలో పని చేశారు. నేరస్తుల మాటలు వినిఉలిక్కిపడ్డారు.తనకుండే ప్రత్యేక అధికారంతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసి "ఉరిశిక్ష పడిన ఇద్దరు నేరస్తులు ఉరి అంటేఏమిటో తెలియని అజ్ఞానంలో ఉన్నారు.వాళ్ళఅజ్ఞానానికి పాలకులైన మనం సిగ్గుపడాలి.ఆఇద్దర్నీ ఉరికంబం ఎక్కించడానికి నా మనస్సుఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.అంగీకరించండి."అని పై అధికారులకు లేఖ రాశారు. నాలుగైదు రోజులు తరువాతమీది అధికారుల నుంచి " నేరస్తు లిరువురుకూరెండు సంవత్సరాలు జైలుశిక్ష వేసి వదిలి వేయండి!" అని సమాచారం అందింది. జైలర్ సంతోషించాడు.ఇదీ కథ! ఇలాంటి సంఘటనలుఎదురవడం వల్లనే జైలుశిక్ష పడిన నేరస్తులకు చదువు చెప్పడం, వాళ్ళకు మంచి చెడుల మధ్యతారతమ్యం బోధ చేయడం, నేరమనస్తత్వంనుంచి వాళ్ళను మరలించడం ఇలాంటి సంస్కరణలను జైళ్లలో తెచ్చారని అంటారు.1983లో 10 కథల వరకు బాలమిత్ర, వికటకవి, బాలజ్యోతి, ఆంధ్రప్రభ లలో వచ్చాయి.ఆ ఉత్సాహం తో 1984 బాలజ్యోతి సంక్రాంతికథల పోటీకి కథను తయారు చేసి పంపేను.(సశేషం) --బెలగాం భీమేశ్వరరావు 9989537835


కామెంట్‌లు