మద్రాసు: --సింగార చెన్నైగా చెప్పుకునే మద్రాసు తమిళనాడు రాజధాని. దక్షిణభారతదేశంలో సంస్కృతీ సంప్రదాయాలకు, ఆర్థిక, విద్యకు కేంద్రబిందువై అలరారుతున్న మద్రాసుకు అనేక ప్రత్యేకతలున్నాయి. మద్రాసుకు సంబంధించి కొన్ని చారిత్రక విశేషాలను చూద్దాం...క్రీ.శ. ఒకటో శతాబ్దంలో (52 - 70) ఏసు క్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ మైలాపూరులో మతబోధ చేశారు రెండో శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి ఈనాడు చెన్నైగా చెప్పుకునే తొండమాన్ మండలాన్ని పాలించాడు.అయిదో శతాబ్దంలో పాండ్య రాజు ఆధీనంలోని మైలాపూరులో తిరువల్లువర్ జన్మించారు. దక్షిణ వేదమని ప్రసిద్ధి చెందిన తిరుక్కురళ్ ని వల్లువర్ అయిదో శతాబ్దంలో రాసినట్లు చరిత్ర పుటలు చెబుతున్నాయి.ఏడో శతాబ్దంలో మైలాపూరులో కపాలీశ్వర ఆలయ నిర్మితమైంది.ఎనిమిదో శతాబ్దంలో తిరువల్లిక్కేణిలో పార్థసారథి ఆలయ నిర్మాణం జరిగింది. తొలుత పల్లవ చక్రవర్తి నరసింహవర్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. పదహారో శతాబ్దంలో చోళ, విజయనగర రాజుల కాలంలో పార్థసారథి ఆలయ విస్తరణ చోటుచేసుకుంది. 1522 లో పోర్చుగీసు మన భారత దేశానికొచ్చి మద్రాసు మైలాపూర్ సమీపంలో శాంథోం (São Tomé) అనే రేవు పట్టణాన్ని ఏర్పాటు చేశారు.1523 లో శాంథోం చర్చ్ (San Thome Church) నిర్మితమైంది.1612 డచ్ వారు మన భారతదేశానికొచ్చి మొదటగా పళవేర్కాడు (Pulicat) ప్రాంతిన్ని ఆక్రమించారు.ఈస్టిండియా కంపెనీ (బ్రిటీష్) వారు 1626 లో పళవేర్కాడుకి 35 మైళ్ళదూరంలో ఉన్న దుర్గాపురం అనే గ్రామంలో ఒక పరిశ్రమను నెలకొల్పాలనుకున్నారు.ధర్మాలా చెన్నప్ప నాయకర్ దగ్గర నుంచి 1639 ఆగస్టు 22 వ తేదీన మూడు మైళ్ళ పొడవైన స్థలాన్ని ఆంగ్లేయులు కొనుగోలు చేసి చెన్నై పట్టణం అనే నామఃరణం చేశారు. సెయింట. జార్జ్ కోటకు శంకుస్థాపన చేశారు. 1640 ఏప్రిల్ 23 న సెయింట్ జార్జ్ కోట నిర్మాణం పూర్తయింది. దేశంలోనే తొలి బ్రిటీష్ వైద్య కేంద్రాన్ని సెయింట్ జార్జ్ కోటలో నవంబర్ 16న ఏర్పాటు చేశారు. ఆనంతరం దానిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు.1668 లో తిరువల్లిక్కేణి గ్రామం చెన్నైలో కలిపారు.. 1672 లో గిండీ లాడ్జిని గవర్నర్ విలియం లాంగ్ హార్నే నిర్మించారు. 1678 లో కాళికాంబాళ్ అమ్మవారి ఆలయం నిర్మితమైంది. 1688 లో చెన్నై నగర మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1693 లో ఎగ్మూర్‌, పురసైవాక్కం, తండయార్ పేట తదితర.గ్రామాలు చెన్నైతో కలిసాయి. 1701లో ఔరంగజేబు జనరల్ దావుద్ ఖాన్ సెయింట్ జార్జ్ కోటపై దాడికి తెగబడ్డాడు. అయినప్పటికీ ఆంగ్లేయులు ఆ కోటను రక్షించుకున్నారు. తిరువత్తూరు, నుంగంబాక్కం, వ్యాసర్పాడి, కొట్టివాక్కం, సాత్తాన్ కాడు గ్రామాలు చెన్నైతో కలిశాయి. 1735లో చిన్నతరిపేట్ట (చింతాద్రిపేట) ఏర్పాటైంది. వేప్పేరి, పెరియమేడు, పెరంబూరు పుదుప్పాకం గ్రామాలు చెన్నైలో కలిశాయి. 1746 లో ఫ్రెంచ్ దళపతి లా బోర్డానాయిస్ సెయింట్ జార్జ్ కోటను స్వాధీనపరచుకున్నాడు. 1749 లో శాంథోమ్, మైలాపూర్ చెన్నైతో కలిశాయి. 1759 లో ఫ్రెంచ్ దాడికి దిగింది. 1767 లో హైదర్ అలీ తొలి సారిగా చెన్నై నగరంమీదకు దాడి చేశాడు. 1768 లో చేపాక్కం భవంతిని ఆర్కాటు నవాబు నిర్మించారు. 1722 లో సెయింట్ జార్జ్ కోటలో జనరల్ ఆస్పత్రిని ప్రస్తుతం సెంట్రల్ సమీపంలో ఉన్న చోటుకి మార్చారు. 1777 లో వీరప్పిళ్ళయ్ ని తొలి కొత్వాల్ గా నియమించారు. ఆ పేరుమీదే కొత్తవాల్ చావడి పేరొచ్చింది. 1784 లో మొదటి వార్తాపత్రిక మద్రాస్ కొరియర్ ప్రారంభమైంది. 1785 లో చెన్నైలో తొలి పోస్టాఫీసు పని చేయడం ప్రారంభమైంది. 1794 లో అతి పురాతన ప్రభుత్వ సర్వే స్కూల్ (Government Survey School ) సెయింట్ జార్జ్ కోటలో ఏర్పాటైంది. ఇప్పుడిది అణ్ణా విశ్వవిద్యాలయంగా మారింది. 1794 నవంబర్ 24 న చెన్నైలో అమెరికన్ ఎంబసీ ప్రారంభమైంది. 1798 లో రాయపేటలో అమీర్ మహలుని ఆర్కాటు నవాబు నిర్మించారు. 1817 లో మద్రాసు లిటరేచర్ సొసైటీ స్థాపితమైంది. 1820 లో గవర్నర్ థామస్ మన్రో (Thomas Munro) గిండీ రాడ్జ్ భవనాన్ని రాజ్ భవన్ గా మార్చారు. 1831 లో మొదటి వాణిజ్య బ్యాంక్ మద్రాస్ బ్యాంక్ (Madras Bank) ఏర్పాటైంది. 1837 లో చెన్నై క్రిస్టియన్ కాలేజ్ ప్రారంభమైంది. 1841 లో ఐస్ హౌస్ (Ice House) నిర్మితమైంది. అమెరికా నుంచి ఐస్ గడ్డలను నౌకలద్వారా దిగుమతి చేసుకుని ఇక్కడ నిల్వ చేసేవారు. అనంతరం ఈ భవనం పేరు వివేకానంద హౌస్ గా మారింంది. 1842 లో తొలి లైట్ హౌస్ ని నిర్మించారు.. 1846 లో చెట్ పట్ లో పచ్చయప్పన్ స్కూలు ఏర్పాటైంది. అనంతరం దీనినే పచ్చయప్పన్ కాలేజీగా మార్చారు. 1851 లో చెన్నై మ్యూజియం ఆరంభమైంది. 1853 లో పార్క్ టౌన్ లో జూ ఏర్పాటైంది.. 1856.లో రాయపురం నుంచి ఆర్కాడు వరకూ రైల్వే లైన్ ను నిర్మించారు. రాయపురంలో మొదటి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. 1857.లో మద్రాసు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 1862 లో మద్రాసు హై కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1863 - 64 లలో స్పెన్సర్ ప్లాజా (Spencer Plaza)ను చార్లస్ డురంట్, జె. డబ్ల్యు సెన్సర్ మౌంట్ రోడ్డులో నిర్మించారు. 1864-65 లో ప్రెసిడెన్సీ కాలేజీ (Presidency College) ప్రారంభమైంది. 1873 లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పార్క్ టౌన్ లో ఆరంభమైంది. 1876 - 78లో బకింగ్ హాం కాలువ తవ్వారు. ఈ ఏడొదే మద్రాసులో తీవ్ర అనావృష్టి నెలకొంది. 1878 లో ది హిందూ దినపత్రిక ప్రారంభమైంది. 1881 లో చెన్నై రేవు పట్టణం ఏర్పాటైంది. . 1884 లో గవర్నర్ మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్ స్టోన్ గ్రాంట్ డఫ్ మెరీనా బీచ్ అనే పేరు పెట్టారు. 1889 లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు.. 1892 లో మద్రాసు హైకోర్టు ప్రారంభమైంది. 1895 లో మొదటి ట్రామ్ వాహన సేవలు ప్రారంభమయ్యాయి. 1899లో తొలి తమోళ దినపత్రిక సుదేశమిత్రన్ ప్రొరంభమైంది. విషయ సేకరణ - యామిజాల జగదీశ్


కామెంట్‌లు