హే వాన కాలం వచ్చిందే ఓయమ్మా కొత్తనీరేమో మెరిసేనే ఓయమ్మా మాయమ్మా హే మన పొలాల గట్లకాడ ఆటాడుకుందామే గుజ్జన గూళ్ళ బొమ్మరిల్లే చేయ ఆడుకుందామా! అదిగో చూడే పారీ పారని మనవాగే చూడే చెలుమేదీసి స్వచ్చని నీళ్ళే దీసి తీయని నీరే మనము కడుపు నిండా తాగుదామే. బిర బిర పోదామే గుంపులు దీరి ఆటలే ఆడుకుందామే బడులే మొదలైతే ఈవాగువంకల ఆటలకే దూరమైతమే చెరువులు చూడవే మన ఊరి అందాలకే అవి పాలమడుగులై కనువిందేచేయునే. నిండీ నిండని చెరువలలో ఈతలు నేర్దామే ఈతలాటలాడి మనము ఈలలు వేద్దామే. ఆహా! వాడలుచూడవే తళతళ మెరిసేటి నీటిబుడగలతో గలగలమని పాములా వంకలు దీరి పారు కుంటూ వచ్చే ఆహా! ఆ అందం చూడవే కాగితాల పడవలు చేద్దమే పారేనీటిలో తరగలపైన పరుగులదీస్తుంటే ఎంతో గమ్మత్తనిపించే. అక్కా! పోదాం పదవే పొద్దున పూట ఆటలే బలే మజా అనిపించే. ఆటలే పొద్దున పూట -జయంత్ నమిలకొండ


కామెంట్‌లు