ఎం. ఇ. ఒ గా వెళ్లిన వారం పది రోజుల్లోనే ఉపాధ్యాయులతో పరిచయం ఏర్పరచుకుందా మని మండల రిసోర్స్ పెర్సన్స్ కు సెంటర్ క్లాస్ ను ఏర్పాటు చేయమన్నాను. సెంటర్ క్లాసులకు ఆ మండలంలో గల టీచర్స్ అంతా హాజరవుతారు .మండలంలో గల ఉపాధ్యాయులు వారి సమస్య లను, పాఠశాల సమస్యలను అక్కడ చర్చించడం జరుగుతుంది. ఆ సమస్యలన్నింటినీ నాతో సమావేశానికి వచ్చిన మండల రిసోర్స్ పర్సన్స్ ( ఎం. ఆర్. పి) నోట్ బుక్ లో వ్రాసి నాకు సబ్మిట్ చేస్తారు. నా పరిధిలో గల సమస్యలను నేను పరిష్కారం చేయాలి. ఉన్నతాధికారుల పరిధిలో ఉంటే వాటిని నేను ఉన్నతాధికారులకు పంపాలి. ఇదీ పద్ధతి. నేను ఎం.ఆర్. పీ లను తీసుకుని కృష్ణా రాయపురం గ్రామంలో గల సెంటర్ క్లాసుకు చేరుకున్నాను. నేను ఆ సెంటర్ కు చేరేసరికి అక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎంత నిశ్శబ్దం అంటే అక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా లేదా అన్నంత నిశ్శబ్దం. అంటే ఎం. ఆర్. పి లు ఫలానా ఇన్ని గంటలకు ఖచ్చితంగా ఎం. ఇ. ఒ గారొస్తారని ముందుగా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా పంపించి ఉంటారనుకున్నాను. నేను మోటర్ బైక్ దిగీదిగ గానే నాకు సెంటర్ క్లాస్ లోకి స్వాగతం పలకడానికి నలుగురైదుగురు టీచర్స్ ఎదురుగా వచ్చారు. పరిచయాల అనంతరం విద్యను విద్యార్థులకు అందజేయడం, సమాజాన్ని చైతన్య పరచడంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి చర్చించడం జరిగింది. తరువాత ఉపాధ్యాయులుఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకో వడం జరిగింది.సమావేశానంతరం ఉపాధ్యాయు లంతా నన్ను సాగనంపారు. నేను ఎం. ఇ. ఓ గా ఉన్నది నెల పది రోజులైనా జిల్లా విద్యాశాఖాధి కారివారి ఆఫీసులో రేషనలైజేషన్ సమావేశాల తోనే ఇరవై రోజుల కాలం గడిచిపోయింది. మిగిలిన కాలంలో ఎం. ఆర్. పి లతో చెప్పకుండా, వారి తోడు లేకుండానే నాకు తెలిసిన పాఠశాల లకు నేను ఒక్కడినే వెళ్ళి సర్ప్రైజింగ్ విజిట్ చేసేవాడిని. ఉదయం తొమ్మిది గంటలకు ప్రాథమిక పాఠశాలలు తెరవాలి. ఆ టైంకు పది నిమిషాల ముందుగా వెళ్ళి పాఠశాలలో ఉండే వాడిని. తొమ్మిది గంటలకు ముందుగా ఎంతమంది టీచర్స్ వస్తున్నారు ? వచ్చినవారు ఈయర్ ప్లెన్స్, మంత్లీ ప్లాన్స్ , లెసన్ ప్లాన్ లు వ్రాస్తున్నారా లేదా?టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్లోను, ప్యూపుల్స్ అటెండెన్స్ రిజిస్టర్ లో ఏమైనా లోపాలున్నాయా? అంటే అటెండెన్స్ రిజిస్టర్ లలో బ్లాంకులుంచడం, తరువాత రోజుల్లో సంతకాలు చేసేయడం. అలానే విద్యార్థుల అటెండెన్స్ విషయంలో రానివాళ్ళకు మరుచటి దినం అటెండెన్స్ వేసి మిడ్- డే మీల్ రైస్ కు, ఇతర సామగ్రీకి ఎసరు పెట్టడం ఇలా ఏమైనా లోపాలున్నా యా అని పరిశీలించడం చేసేవాడిని. కొన్ని సందర్భాల్లో పాఠశాలలు ప్రారంభించిన అరగంట తరువాత పాఠశాలకు వెళ్లే వాడిని. వెళ్ళినవెంటనే హెడ్మాష్టారును టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ను , అన్ని తరగతుల విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ లను అందజేయ మనేవాడను. అందులో లోపాలు ఏమైనా కనిపిస్తే హెడ్మాష్టర్ కు మెమో పంపించేవాడను. ఎం. ఇ. ఓ పోస్ట్ లో పదిహేను రోజులే కొనసాగిస్తామన్న జిల్లా విద్యాశాఖాధికారివారు నెల పది రోజులు కొనసాగించారు.ఇంతలో ఒక గ్రామానికి సంబంధించిన పెద్దలు వచ్చి ఆ గ్రామ పాఠశాలకుసంబంధించిన ఒక టీచర్ పాఠశాల వేళళ్ళో రోజూ పీకమొయ్యి తాగేసొచ్చి స్కూలులో పిల్లల ఎదుటే బండబూతులు తిట్టి తిట్టి అలా సొమ్మసిల్లి పడిపోతాడనీ అతనికి మరో రాజకీయ పార్టీ వత్తాసుపలుకుతుందని చెప్పుకొచ్చి చాటభారతమంత కంప్లైంట్ తెచ్చి ఇచ్చారు.వారి ఫిర్యాదు సమంజస మైనదే ! అటువంటి టీచర్స్ ను విద్యాధికారులుగానీ రాజకీయ పార్టీలు గానీ క్షమించకూడదు. నేను ఆ టీచర్ పై ఎన్కైరీ జరిపి ఆ రిపోర్ట్ తప్పనిసరిగా ఉన్నతాధికారులకు పంపి సస్పెండ్ చేయించాలి. కానీ ఎం. ఇ. ఓ పోస్ట్ లో వారం, పది రోజుల కన్నా ఎక్కువ కాలం ఉండను. వెళ్ళి పోయేముందు ఈ పెంచేందుకు? అని ఆలోచించి వచ్చేవారికి సర్దిచెప్పేసాను. ఈసారికి చూడండి. మరల ఇదే పరిస్థితి కొనసాగితే తప్పనిసరిగా చర్య తీసుకుంటాం అన్నాను. కాదూ పోదు అని మీరంటే మీరిచ్చే రిపోర్టుపై నేను వచ్చి ఎన్కైరీ జరిపి ఆ రిపోర్టును నేను ఉన్నతాధికారులకు పంపిస్తాను. మీలో మీకు తగాదాలు మరింత పెరిగిపోతాయి. ఇక పత్రికా విలేకరులు రావడం ఈ తగాదాలు పేపర్లలో వేయడం, పాఠశాల పరువు, ఊరు పరువు పోవడం లాంటివి జరుగుతాయి. ఆలోచించి చెప్పండి అన్నాను. నేను కూడా ఎం.ఇ.ఓ గా వారం, పదిరోజులు కంటే ఎక్కువ ఉండను. కొత్త ఎం. ఇ. ఓ వస్తారన్నాను. నామాటలతో వారు వెనక్కు తగ్గారు. నేను ఆ పోష్టు నుండి బయటకు రావడానికి డి ఇ ఓ గారిపై ఎంతో వత్తిడి తెచ్చాను. ఆ ఒత్తిడిని భరించలేక డి. ఇ. ఓ గారు నాతో " ప్రభాకరం! ఎం. ఇ. ఓ పోస్ట్ అందరూ కావాలి ,కావాలి అంటుంటే నివ్వొద్దంటా వేమిటి? ఆ పోష్టు వద్దన్నవాడిని నిన్నే చూశాను."అన్నారు. నాకు ఆ పోష్టు నుండి మరో నాలుగైదు రోజులలో విముక్తి కలుగుతుందనగా ఒకే రోజు మారుమూల గ్రామాల్లో ఉన్న ఆరేడు పాఠశాల లను విజిట్ చేసాను. ఆ విజిట్ లు జరిపిన అయిదారు రోజులలోనే నన్ను ఎం. ఇ. ఓ పోస్ట్ నుంచి రిలీజ్ చేసినట్లు ఆర్డర్ వచ్చింది. నాకుఎంతో రిలీఫ్ ఇచ్చినట్లయింది. ఆ రోజు నుండి నా హెడ్మాష్టరు పదవిలోనే కొనసాగాను. మరి కొన్నాళ్ళు అయిన తరువాత డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ మోనటరింగ్ ఆఫీసరుగా నైట్ స్కూల్స్ పై అధికారిగా మూడు సంవత్సరాలు డెప్యుటేషన్ పై జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వస్తారా అని అడిగారు. దానినీ తిరస్కరించాను. ప్రధానోపాధ్యాయుని పోస్ట్ లో నున్న ప్రశాంతత ఏ పోస్ట్ లోనూ రాదు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొంతమందికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అవి నాలాంటివారికి పనికిరావేమో ! ( సశేషం ) -- శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ : 701 3660 252.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
రచయిత్రి శ్రీమతి అనూరాధకు సత్కారం
• T. VEDANTA SURY
ఉరి తీయాలి!!!?;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
ముఖాముఖి (ఇంటర్వ్యూ); E.అపర్ణ;- తొమ్మిదవ తరగతి -ZPHS Narmetta -Dr.జనగామ
• T. VEDANTA SURY
పొడుపు కథలు. సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి