విశాలం!! వైశాల్యం లెక్కలతో ప్రతిపాదించే సూత్రీకరణ కాదు విశాల వేదిక కూర్చి అనుభవం లోంచి ప్రబోధనలెన్నో చేయొచ్చు పచ్చని లతలు, చెట్ల మధ్య విశాల మైదానంలో క్రీడావిన్యాసం అద్భుతమే కావచ్చు రోడ్ మీద వాహనాల పాట్ల మధ్య తప్పించుకు తిరిగే దంతా యాంత్రిక ప్రజ్ఞాయై వుండొచ్చు అద్దాల మహళ్లతో విలాసంగ వుండే మనిషి విశాల గృహం కావచ్చు! గదులు కాదు హృదయం విశాలమై ఆర్తిగా హత్తుకోవాలి మైదానం కాదు మది విశాలం కావాలి రోడ్ కాదు నడిచే కాళ్ల నడత విశాలం కావాలి విశాలమంటే ఆధ్యాత్మిక బోధనా గుమ్మరింత కాదు ఆత్మీయ స్వాంతన కావాలి విశాలం శుష్క భావన కాదు వినమ్రంగా సాగిలపడే చిత్త ప్రవృత్తి. -కె ఎస్ అనంతాచార్య.


కామెంట్‌లు