బాల్యానికి భరోసా---నలిగల రాధిక రత్నPH:8639635538-- మన బాల్యం మనకింకా గుర్తుండే ఉంటుంది.... కర్ర బిళ్ళ ,కోతికొమ్మచ్చి చెడుగుడు ,కోకో కబడ్డీ ,క్రికెట్ వంటివి.... మనం విన్నవి,కన్నవి ఆడినవి ఆనందించినవి.... కానీ నేటి తరం మర్చిపోతుంది బాల్యాన్ని ..... మరిచిపోయేలా చేస్తుంది మనమే....... క్రూరంగా ..... చంపేస్తున్నాం బాల్యాన్ని... చిదిమేస్తున్నాం చిన్నతనాన్ని..... ఆడిస్తున్నామా చిన్న పిల్లల్ని ..... గంతులు వేయనిస్తున్నామా .... పదిమంది పిల్లలతో కలిసి..... పరిచయం చేస్తున్నామా ప్రకృతిని.... అనుబంధాన్ని పెంచుతున్నామా "జీవకోటి తో" టాయ్స్ బదులుగా అందిస్తున్నాం టాబ్బ్ ... కాలక్షేపం కోసం కంప్యూటర్స్... అల్లరి చేయకుండా వీడియో గేమ్స్... ఆడుకోవటానికి సెల్ ఫోన్స్ ఇస్తూ.... పిల్లల్ని మరబొమ్మలు గా మారుస్తున్నాం..... "బాల్యమే భారంగా" గడిచిపోతుంది బిడ్డలకూ.... ఆధునికత ,అత్యాశ ఆడంబరం ,అతి బోధన వారి పట్ల మనం చూపుతున్న "క్రూరత్వాలే" పోటీ ప్రపంచంలో పిల్లలను .... ముందుంచాలని వారి జీవితాన్ని లూటీ చేస్తున్నాం అనారోగ్యానికి రూటూ చూపుతున్నాం.... గోరుముద్దలు తినిపించే వయసులో బిరియాని తినిపించాలని ప్రయత్నించి... పిల్లలలో మొండితనం, పెంకితనం ఏర్పడటానికి మనమే అవుతున్నాం కారణం ప్రకృతి ప్రసాదించిన బాల్యాన్ని బలి చేస్తున్నాం అంతర్జాల వలకు.... వండర్ కిడ్స్ ను చేయాలన్న తపనతో టాటా చెప్పేశాం జోల పాటలకు కూడా ..... అలవాటు వ్యసనంగా మారి ఇంటి సమస్యలూ, ఒంటి సమస్యలూ , ఆరోగ్య సమస్యలూ నేడు బాల్యమే కనుమరుగయ్యే "పెను సమస్య" తల్లిదండ్రులారా !! మేల్కొండి "బాల్యానికి భరోసా" మీరిస్తే .... "బాలల చిరుకోరికలకు " ఆసరా మీరైతే భావిజీవితమంతా కులాసానే నేటి బాలలే రేపటి పౌరులు అన్నది ఒకప్పుటి నిజం ... నేటి బాలలే రేపటి బలి పశువులు అన్నది "కఠిన వాస్తవం"


కామెంట్‌లు