నా ప్రియ మొలక మిత్రులారా.శుభోదయం.మన పీవీ తాత వరంగల్ లో హైస్కూలు విద్య చదివారు.అది నిజాం పరిపాలన.ఉర్దూ మాద్యమం లో బోధన.ఆయనకు గణితం ,సైన్స్ లలో ఎక్కువ అభిరుచి.ఆంగ్లంలో అప్పటికే పట్టు లభించింది.ఆరోజుల్లో ప్రతి శుక్రవారం సెలవు దినం.రంజాన్ ,మొహర్రం పండుగలకు పదిరోజుల పాటు సెలవులు.ఉర్దూ ,లో ముషా యిరాలు (కవిత్వం చదవడం )ఖవాలీలు లాంటి సాంస్కృతికకార్యక్రమాలు జరిగేవి.పీవీ తాత వాటికి హాజరయ్యే వారు.ఉర్దూ చాలా మధుర మైన భాష.ప్రతి భాషలోనూ ఒక మాధుర్యం ఉంటుంది.వివిధ పండ్లలో వివిధ రుచులను మనం ఆస్వాదించడం మంచిది.అది ఆరోగ్యానికి లాభ దాయకం.అలాగే భాష లన్నీ మంచివే.అన్నీ నేర్చుకోవాలి కానీ మాతృభాషను మరువరాదు.అలా ఓ రాత్రి ఒక ముషాయిరా లో శ్రోతగా పాల్గొని ఆనందిస్తున్న విద్యార్థి పీవీ కి ఎవరో ఒకరు భుజంతట్టి నట్లుగా అనిపించింది. ప్రక్కకుచూస్తే ఒక వ్యక్తి.తన ఈడు వాడే.సలామా లేకుం.అని ముస్లిం సంస్కృతి ప్రకారం నమస్కారం చేశాడు.ఏమీ మాట్లాడలేదు.పీవీ తాతకు ఒక దిన పత్రిక లో చుట్టి ఉన్న ఓ పుస్తకం ఇచ్చారు.ఇంటికివెళ్లినాక చూడు.ఇప్పుడు చూడకు.అని వెళ్లిపోయాడు.అంతే.ఆ వ్యక్తి ఎవ రో ,పేరేమిటి, ఏమీ చెప్పలేదు.ఆపుస్తకం వివరాలు రేపు.సరేనా.శుభాకాంక్షలుచెబుతూ మీ సంతోష్ బాబు మామయ్య.


కామెంట్‌లు