నా ప్రియమైన మొలక స్నేహితులారా.శుభోదయం.మన పీవీ తాత శతజయంతి ని పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ఒక ప్రత్యేక తపాలా బిళ్ల ను విడుదలచేయాలని నిర్ణయంతీసుకుంది.అది ఎంతో అభినందనీయం.ఎవరైనా వ్యక్తుల బొమ్మతో తపాలా బిళ్ల విడుదలచేయడం అంటే అది ఒక గొప్ప గౌరవంగా భావించాలి.ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా ఉత్తరాలు రాసుకొనే వారు.అప్పుడు ఫోన్లు ,సెల్ ఫోన్లు లేకుండేవి.అందువల్ల తపాలా శాఖ సేవలను అధికంగా వాడుకోనేవారు.దానికి తపాలా బిళ్ళల అవసరం కదా.తపాలా బిళ్ళల సేకరణ కూడా ఒక మంచి వ్యసనం.ప్రస్తుతం వాటి వాడుక తగ్గింది.కానీ మీరు ఆ అలవాటు నేర్చుకోవాలి.వివిధరకాల తపాలా బిళ్ళలను సేకరించి భద్రపర్చుకోవాలి.ప్రతి తపాలా బిళ్ళ వెనుక ఓ చరిత్ర ఉంటుంది.మహనీయులు చేసిన దేశ సేవ,త్యాగాలు,మనకు తెలియ చెప్పుతాయి అవి.మీకు శుభాకాంక్షలు చెబుతున్నాడు మీ సంతోష్ బాబు మామయ్య.


కామెంట్‌లు