అలంకారం!! ఆలోచనల ఇటుకలు పేర్చి అనుభవాల గదులు తీర్చిన అక్షర భవంతి! ముందంతా పద్య వనాలు కవన పరిమళాలు! అంత్యాను ప్రాసల షెల్ఫ్ లు చెక్కనాలు, కుందానాల ఉపమాలన్కారాలు కిటికీ మీద వాలిన పిచ్చుకుల జంట అచ్చు అమ్రేడితం! ముందరి మెట్లన్నీ దత్తపదులై వచ్చిన ఆటవేలదులు! ఇళ్లంటే ఆలంకారికుని కవన రస రాజ్యం. -కె ఎస్ అనంతాచార్య


కామెంట్‌లు