ప్రాపంచిక దృక్కోణం ----సుజాత.పి.వి.ఎల్.--గొప్పతననాన్ని ప్రదర్శించే విషయంలో ప్రతిఒక్కరూ ప్రాపంచిక దృక్కోణాన్ని విసర్జించాలి. లేదంటే వినాశనానికి దారి తీస్తుందని రుజువు చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, ఎస్తేరు మొర్దెకైల కాలంలో పారసీక రాజు ఆస్థానంలో ప్రముఖుడు. అధిక పలుకుబడి గల హామాను. ఘనత కోసం అర్రులు చాచటం అతని అవమానానికి, చివరకు మరణానికి కూడా దారితీసింది. తిరుగులేని అధికారం చెలాయిస్తున్న కాలంలో పిచ్చి పట్టిన, అహంకారం గల నెబుకద్నెజరు తన గొప్పతనం వ్యక్తపరిచే విషయంలో వక్ర తలంపు గల మాటల్లో ఇలా వ్యక్తపరిచాడు. ''బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా?, అలాగే దేవుణ్ణి మహిమ పరచడానికి బదులుగా తనను అపారంగా మహిమ పరచడాన్ని గర్విష్టి అయినా హేరోదు అగ్రిప్ప ఆమోదించాడు. తత్ఫలితంగా అతడు శరీరంలో పురుగులు పడిప్రాణము విడిచెను''. గొప్పతనం విషయంలో యెహోవా దృక్కోణాన్ని అర్థం చేసుకోకపోవడం వీరందరూ అవమానకరంగా పతనమై పోవడానికి దారితీసింది.మనకు గౌరవ మర్యాదలు తీసుకొచ్చే విధంగా జీవించాలని మనం కోరుకోవడం సరైనదే. అయితే, అపవాది తన సొంత లాలసకు ప్రతిబింబమైన అహంభావ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఈ కోరికను ఉపయోగించుకున్నాడు. ''ఈ యోగ సంబంధమైన దేవత '' అని, ఈ భూమ్మీద తన ఆలోచనలను పురికొల్పడానికే తీర్మానించుకున్నట్టు వ్యక్తమవుతోంది. లోకంలో పెద్ద పేరు, ప్రజలచే గౌరవాభివందనాలు, జేబుల నిండా డబ్బులు వంటివి సంతోషభరిత జీవితాన్ని అందిస్తాయన్న ఆలోచన సరియైనది కాదు. అది తెలివి తక్కువ తనం లాంటిది. ఎలాగంటే, గాలిని పట్టుకొని బంధించే ప్రయత్నం లాంటిదే!. మానసిక ప్రశాంతత, శాశ్వత సంతోషం అనేవి పరులకై జీవించే మహనీయులకు మాత్రమే సొంతం. అలాంటి వారు లేనిపోని గొప్పతనాన్ని ప్రదర్శించరు. ఏ రంగమైనా సరే గొప్పతనం విషయంలో ప్రాపంచిక దృక్కోణం శాశ్వత సంతృప్తికి హామీ ఇవ్వదని గ్రహించడం మేలు.


కామెంట్‌లు