యువతకు స్పూర్తి ప్రధాత స్వామి వివేకానంద - కవి ఉండ్రాళ్ళ రాజేశం---హిందుమత ప్రాశస్త్యం గూర్చి ఎన్నో దేశాలలో ఉపన్యసించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింప జేసిన మహనీయులు స్వామి వివేకానంద అని కవి ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా కవులు కొణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్ లతో కలిసి చిత్ర పటానికి పూలమాల వేసి మాట్లాడుతూ చికాగో సర్వ మత సమ్మేళనంలో సోదర సోదరీమణులారా అన్న మాటతో వివేకానందుడు ప్రపంచ జనుల హృదయాలలో చోటు దక్కించుకున్నాడని అన్నారు. అనేకమార్లు యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు వుందని చైతన్యం నింపిన వివేకానందుడి అడుగుజాడల్లో యువతరం సాగాలని అన్నారు. గొప్ప తాత్వికుడుగా వేదాలను బోధిస్తూ, భారత దేశంలోనే కాకుండా విదేశాలలో హిందూ ధర్మాన్ని సుసంపన్నం చేసిన స్వామి వివేకానంద ఎప్పటికి యువతకు స్పూర్తి ప్రధాతగా, ఆదర్శప్రాయులని కవి ఉండ్రాళ్ళ రాజేశం కొనియాడారు.


కామెంట్‌లు