సుధావాణి ......... ధనవంతులు తింటారు సన్నబియ్యం పేదలు తింటారు దొడ్డుబియ్యం ధనవంతుల పేదల బ్రతుకులు సమాంతర రైలు పట్టాలు ధనవంతులకు ఉంటాయి మేడలు పేదలకు ఉంటాయి గుడిసెలు ప్రక్కనే ఉంటాయి ఇండ్లు కనబడవు ధనవంతులకు కండ్లు చూసింది నిజం కాదు విన్నది నిజం కాదు నిజం నిలకడపైన తెలియును పాలు నీరు వేరగును అతి మంచి వద్ధు ఎవరికి నమ్మ వద్దు నమ్మితే మోసం జరుగును ఆపై హాని కలుగును బీడీ కార్మికుల బ్రతుకు మాడిన బియ్యం మెతుకు ఎవరికి పట్టని గోడు నిలబడరు ఎవరు తోడు ....జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా నిర్మల్ జిల్లా ౯౪౪౧౩౩౩౩౧౫


కామెంట్‌లు