మూత్ర పిండాలలో రాళ్ళ సమస్య వచ్చినప్పుడు కొండ పిండి కూర చెట్టు వేరు భాగాన్ని కడిగి రసం తీసి , ఉల్లిగడ్డ రసంతో కలిపి తాగితే మూత్ర పిండాలలో రాళ్లు కరిగి పోతాయి. మూర్చ్ వ్యాధిలో ఉల్లి గడ్డ రసాన్ని ముక్కులో వేస్తె వెంటనే లేచి కూర్చుంటారు . పంటి చిగుళ్ల నుంచి రక్తం కారితే ఉల్లి రసంతో ఉప్పు కలిపి చిగుళ్లపై రుద్దుకుంటే రక్తం రావడం ఆగి పోతుంది . పరి గడుపున ఉల్లి పాయ రసంలో నిమ్మ రసం కలిపి ప్రతిరోజూ తాగితే శరీరం బరువు క్రమంగా తగ్గుతారు ఉల్లి గడ్డను మెత్తగా దంచి అందులో తేనే +నెయ్యి + బెల్లం కలిపి ప్రతి రోజు తింటూ ఉంటే శుక్రవృద్ధి కలుగుతుంది. జీర్ణ శక్తి తగ్గినప్పుడు ఉల్లిని సన్నగా తరిగి పసుపు +జిలకర +ఉప్ప్పు పొడి చేసి భోజనం లో తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది.
ఉల్లిగడ్డలు ఎన్నో ప్రయోజనాలు -3- పి కమలాకర్ రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి