కంటి సమస్యలు -5 -నివారణ -పి .కమలాకర్ రావు

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగ ముద్రలు కూడా ఎంతో సహాయ పడతాయి. మనం కంటి సమస్యల పై చర్చిస్తున్నాం కాబట్టి కంటి సమస్యలు రాకుండా ;పనికి వచ్చే యోగ ముద్రల గురుంచి తెలుసుకుందాం . మొదటిది , జ్ఞాన ముద్ర లేక ధ్యాన ముద్ర చూపుడు వేలు , బొటన వేలు కలిపి గట్టిగా నొక్కి పట్టి ఉంచి మిగతా మూడు వేళ్ళు చక్కగా ఉంచి సుఖాసనం లో కొద్దీ సేపు కూర్చోవాలి. దీనితో ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చురుకుదనం తెలివి తేటలు పెరుగుతాయి. మోదా శక్తి పెరుగుతుంది. దీని తర్వాత వేయాల్సిన ముద్ర రెండవది ప్రాణ ముద్ర , చిటికెన వేలు ఉంగరపు వేలు , బొటన వేలు ఈ మూడు వేళ్ళు కలిపి నొక్కి పట్టి ఉంచాలి. శరీరంలో ఉన్న ప్రాణ శక్తి ఉత్తేజం అవుతుంది. శక్తి సమకూరుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కంటి సమస్యలు రానివ్వదు . దృష్టి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. త్వరగా అలసట రాదు. ఆకలి దప్పులకు ఓర్చుకునే శక్తి పెరుగుతుంది. అందుకని. జ్ఞాన ముద్ర  లేక ధ్యాన ముద్ర తరువాత ప్రాణ ముద్ర కూడా వేస్తె కంటి శక్తి పెరిగి , ఏకాగ్రత పెరిగి చిన్న పిల్లలు, పెద్ద వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.


కామెంట్‌లు