సౌదామిని -- గురజాడ రచన : -శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.

గురజాడవారి  కథ " సౌదామిని"  నాలుగు అంకాలను పరిశీలనగా చదివితే. రెండు, మూడు అంకాలలోకనిపించని కవి నాల్గవ అంకములోకి మనము వచ్చేసరికి కవి అనుకో కుండా  ప్రత్యక్షమవుతాడు.అంతవరకూ అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు.ఎక్కడ నుండి వచ్చాడోతెలియదు. ఆ పరిసర ప్రాంతాలలోనే ఎక్కడో ఉన్నట్టు మనం ఊహించు కోవాలి. మొదటి అంకములో రైలులో రచయితతో ప్రయాణి స్తున్న కవి ఆ రైలు కంపార్టుమెంట్లో ప్రయాణిస్తున్న ఒక స్ర్తీ మోజులో పడతాడు. ఆమెతో చాలా విషయాలు చర్చిస్తాడు. ఒక స్టేషన్ వచ్చేసరికి ఆమె దిగిపోతుంది. ఆమె మాటలచే ఆకర్షింపబడ్డ కవి ఆమెతో విద్యా సంబంధ విషయాలు మాట్లాడాలన్న నెపంతో ఆమెతో వెళ్లిపోతాడు. రచయిత కూడా కవి వెళ్లిపోవడాన్ని చూసి అతను కూడా ఆ స్టేషన్లోనే దిగిపోతాడు. కానీ కవి ఎక్కడు న్నదీ, రైల్లో కలిసి నావిడ ఎక్కడున్నదీ రచయిత తెలుసుకోలేకపోతాడు. నాల్గవఅంకం ఉన్నట్టుండి రచయితతోనూ, బాలయ్యతోనూ చర్చల్లో పాల్గొనడం పాఠకులకు విచిత్రంగా గోచరిస్తుంది  కవి ఎక్కడ  నుండి వచ్చాడు ఏమిటని ? మనం నాలుగవ అంకం లోకి  ప్రవేశించేసరికి కవి, రచయిత, బాలయ్య చర్చల్లో పాల్గొనడం చూస్తాము. ఒకటో అంకములో కనిపించిన స్ర్తీ యొక్క, కవి యొక్క ఉనికిని మధ్య అంకాలలో గురజాడ తెలియజేస్తే కథలో కంటిన్యుటీ ఉండేది. నాలుగవ అంకం ప్రారంభంలో కవి కనిపిస్తూ చర్చలో పాల్గొని   " స్ర్తీ లేచి తిరగబడాలి. మనుషుల్లో మేలైనది. ఆమె అబల అని మీరంటారు. మన దేశంలోని రైతు కుటుంబం స్ర్తీల గురించి చెబుతూ  ఆమె నీళ్ళు తోడుతుంది. వంటావార్పు చేస్తుంది.
నాగరికత గల స్ర్తీ దైవ సృష్టిలో ఉత్క్రుష్టమైనదైనా ఈమె శారీరకంగా బలహీనురాలని నేను ఒప్పుకుంటాను. కానీ పాశవిక శక్తిని ఎందుకూ పనికిరానివిగా చేసే పరికరాన్నిఆమె చేతుల్లో పెడదాం. ఖడ్గ విద్య   స్ర్తీ  మాత్రమే నేర్చుకోవాలి "
అంటాడు. మనుషుల్లో మేలైనది స్ర్తీ( మనుషులు అంటే,  ఆడ, మగ అని అర్ధం )అంటాడు. మగవారికంటే స్ర్తీ మేలైన
దని గురజాడ భావం. భారతీయ స్ర్తీ అబలకాదు  సబల అంటాడు గురజాడ ' కవి' పాత్ర ద్వారా. ఇక్కడ మన
దేశపు స్ర్తీలను రెండు వర్గాలుగా చేసి చూపించాడు. రైతుకుటుంబం నుండి వచ్చిన స్ర్తీ నీళ్ళు తోడుతుందనీ, వంటా వార్పూచేస్తుందని చెబుతాడు.నాగరికత గల స్ర్తీ దైవసృష్టిలోఉత్క్రుష్టమైనదైనీ,  ఈమె శారీరకంగా బలహీనురాలని చెప్తాడు.అవసరం వస్తే అందరు స్ర్తీలు నీళ్ళు తోడుకుంటారుఇంటిపనీ,  వంటపనీ చేస్తారు. చెయ్యాలి కూడాను. రెండు వర్గాల స్ర్తీలు పాసవిక శక్తులపై తిరుగుబాటు చేయగలరు.  అటువంటి ' స్ర్తీ'  సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తిరగబడాలి. సంఘ  విద్రోహులపై తన ప్రతాపాన్ని చూపాలి.
అందుకోసం ఖడ్గ విద్యను స్ర్తీ మాత్రమే నేర్చాలంటాడు. 
నరకాసురుని వధించడంలో యుద్ధ  విద్యలు నేర్చిన సత్యభామ సత్తా ఏమిటో మనకు తెలిసిందే ! అందుకే  నరకాసురుని లాంటి పాశవిక శక్తుల దుమ్ము దులపాలంటే 
స్ర్తీ  ఖడ్గవిద్య  నేర్చాలి.  పురుషులకు  బుద్ధి మాంద్యం, క్రూరత్వం  ఉన్నాయి. కాబట్టి  స్ర్తీ  కత్తి సాముచేయాలి.      బయటికు వెళ్ళే సమయంలో  ప్రతీ  స్ర్తీ రివాల్వర్, బాకు
తీసుకువెళ్లాలి. అప్పుడు మాత్రమే క్రూర పురుషుల దాడి
నుండి స్త్రీ తన్ను తాను రక్షించుకోగలదు. అంతేకాదు " కవి" 
పాత్ర ద్వారా గురజాడ స్ర్తీ స్వేచ్ఛ కోసం మరికొన్ని సూచనలు
చేసాడు. అవేమిటంటే --- వంట చేయడాన్ని నిషేధించి 
దుకాణం నుంచి ఆహారం తెచ్చుకోవాలి. దాన్ని వెచ్చపెట్ట డానికి  అవసరమైన సామగ్రి ఉంచుకోవాలి. ఇంటివంట
కంటే దుకాణంలోనే వంట బాగుంటుంది. ప్రతీ వీధికి ఒక దుకాణం  ఉండాలి.  కుటుంబం  అంతా  అక్కడకు  వెళ్ళి భోజనం చేస్తుంది.ఇక వంటావార్పు చింతే ఉండదు. ఇట్లా శక్తి  ఎంత పొదుపవుతుందని ' కవి ' అంటాడు. ఆ మాటలు
విన్న ' రచయిత'  ఖండించి పేదవాళ్ళ సంగతి ఏమంటాడు. 
బాలయ్య వెటకారంగా ''  కవి యొక్క ఊహా స్వర్గంలో పేదలే ఉండరు" అంటాడు. స్ర్తీ స్వేచ్ఛను కోరి వారి సంసారాలను హోటళ్లకు అప్పజెప్పడం, అలాగే హోటళ్ళలో భోజనం చేసిన కుటుంబాల ( ముసలివారు, భార్యాభర్తలు, పిల్లలు)ఆరోగ్య  పరిస్థితును తలవక ఏదో చిల్లరమల్లర ఆలోచనలు పాఠకులముందుంచడం గురజాడలాంటి రచయితకు తగదనిపిస్తుం ది. గురజాడ పైన పేర్కొన్న సూచనలను ఏ ఒక్క సంసారిక కుటుంబం అంగీకారించినా తాత్కాలిక అవసరాలకోసమే.ఇది సమాజ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది కథ గాబట్టి సర్దిపెట్టుకుపోదామనుకున్నా గురజాడవారి సూచన సరియైనది కాదు. ఇంకా మిగిలిన కథలోకి వెళ్దాం. బాలయ్య కు.  ' కవి'  గారి. ఆలోచన ఒకటి నచ్చింది. అదే ' ఖడ్గ విద్యాభ్యాసం'. ఇక్కడ గురజాడవారు వ్రాసిన వాక్యాలు చూడండి ." కవిగారు ఖడ్గ విద్య నేర్పడానికి పూనుకుంటారు. ఆమె నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. పెత్తనం అంతా ఆయన దే.  ఆమెకు కవిత్వం కూడా నేర్పుతారు.  ఆమె పద్యాలు చదవడంప్రారంభిస్తుంది". కవి ఎవరికి ఖడ్గ విద్య నేర్పడానికి పూనుకుంటాడు ? ఎవరు నేర్చుకుంటారు ? ఎవరికి  కవిత్వం నేర్పుతారు? ఎవరు పద్యాలు చదవడం ప్రారంభి స్తారు ?  ఇక్కడ 'ఆమె' అంటే ఎవరు ? 'ఆమె' అనే పదంలో  సందిగ్ధత ఉంది.  రైలులో ప్రయాణం చేసిన స్ర్తీయా ? లేక బాలయ్య కూతురు-- సౌదామినియా ?  ఇంకా ఎవరా ?    నాల్గవ అంకములో ఎక్కడా ఒక  స్ర్తీ పేరైనా పేర్కొనబడ  లేదు. అయితే ఇక్కడ ' ఆమె ' అంటే  ' సౌదామిని' అని మాత్రమే మనం  ఊహించుకోవాలి.  ఇంత  అస్తవ్యస్తంగా గురజాడ రచన ఉంటుందని మనం భావించలేం ! ( సశేషం )


కామెంట్‌లు