న్యూస్ పేపర్ !!-కె ఎస్ అనంతాచార్య.

పత్రికోక్కటున్న
పదివేల సైన్యంబు
 నార్ల వారిమాట  అక్షరాలా 
ముత్యాల మూట!
సంచలనాన్ని
సైలెంట్ గా
మోసుకొచ్చి ముంగిట
నిలిపే అపరాధ పరిశోధకుడు
క్షణ క్షణం అప్రమత్తమవుతూ
సేకరించిన విశేషాలన్నీ
మోసుకొచ్చే ఉషోదయాన్నే
పలకరించే అక్షరకిరణం
కాఫీ తాగకున్నా
ఫరవాలేదు
పేపర్ చదవకుంటే
న్యూస్ మేనియా
ఒక్కో అసత్యాన్ని
చీల్చి చెండాడే
వీరభద్రుడు!
రాజకీయ కుళ్లును
అక్షరాలతో  కడిగి
ఆరవేసే క్షారం
ఆధ్యాత్మికత
ఆర్ష విజ్ఞానమంతా
కలబోసి అందించే
ధర్మ సింధువు
విజ్ఞానం,వినోదం
క్రేడలతో అన్నదాతకం డగనిలిచే
పచ్చని వెన్నెముక
రోజులో వాడిపోయే
పూవైనా ఘాటు
పదికాలాల దాకా వదలదు
వాస్తవ వాదం
అక్షరాలలో నింపి
చేసే రిపోర్టింగ్
 జగతిని కుదిపే స్టింగ్
జర్నలిజం అంటే
విపత్తును ఊహించి
జగత్తును మేల్కొల్పే
మహత్తు


కామెంట్‌లు