సముద్రతీరం సమీపంలో ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టులోని ఓ కొమ్మ పైభాగాన ఓ పక్షి జంట గూడు కట్టుకుని నివసిస్తున్నాయి. ఆ గూటిలో ఓ నాలుగైదు గుడ్లు పెట్టి పొదుగుతున్నాయి. మగపక్షి, ఆడపక్షి ఎప్పుడు పిల్లలు బయటికొస్తాయాని ఎంతో ఆత్రుతతో చూస్తున్నాయి.
ఓరోజు పెనుగాలి వీసింది. అలలు ఉప్పొంగి ఎగసిపడుతున్నాయి.కొమ్మ మీదున్న గూడు గాలి వేగొనికి తట్టుకోలేక నీటిలో పడి మునిగిపోయింది.
పక్షి జంట మనసు ముక్కలై బోరుమని విలపించాయి. గూడు మునిగిన చోట ఈ పక్షి జంట అటూ ఇటూ తిరుగుతూ అరుస్తున్నాయి.
ఆడపక్షి బాధతో చెప్పింది -
"ఎలాగైనాసరే నేను మన గుడ్లను చూడాలి. లేకుంటే నేను చనిపోతాను" అని.
ఆ మాటలు విన్న మగ పక్షి "తొందరపడకు. ఏదో ఒక మార్గం ఉంటుంది. మన గూడు తీరం పక్కనే పడింది.గూటితోపాటే నీటిలో పడింది కనుక గుడ్లు ముక్కలవవు. వాటికే నష్టం జరిగిందనుకోను. ఈ సముద్రం ఎండిపోతే మన గూడూ గుడ్లూ మనకు లభిస్తాయి" అని ఆడపక్షికి ధైర్యం చెప్పింది.
ఆడపక్షి "నంవ్వు చెప్పడం బాగానే ఉంది. కానీ సముద్రంలో నీరు ఎప్పటికి ఎండాలి. మనవల్ల ఆ నీటిని ఇంకిపోయేలా చేయగలమా?" అని అడిగింది.
గుడ్లలోంచి మన పిల్లలు బయటకు రావడానికి టైమ్ పడుతుంది. కనుక మనం క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కొన్ని రోజులపాటు మన పని కానివ్వాలి. అదేంటంటే మన నోటితో నీటిని తీసుకొచ్చిఎగురుకుంటూ పోయి దూరంగా విడిచిపెడదాం. ఇలా చేస్తే సముద్రంలో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు మన గుడ్లు మనకు దక్కుతాయి అని ఒక్కటిగా అనుకున్నాయి. తామనుకున్నట్లే నీటిని మరొక చోట విడిచిపెట్టడం మొదలుపెట్టాయి పక్షులు.
పక్షుల ఆత్మవిశ్వాసంతో తమ పని చేస్తూ వచ్చాయి. వాటి అవిశ్రాంత కృషి వల్ల సముద్రంలో నీరు తరిగిపోయి తాభనుకున్నట్లే గుడ్లు లభించొచ్చు. అదలా ఉంటే, ఆ సముద్రతీరానికి ఓ రోజు ఓ సాధువు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన సామాన్యుడు కాడు. బోలెడు మహిమలు కలవాడు. అక్కడ పక్షుల అరుపులు వినిపించి చుట్టూ చూసాడీ సాధువు.
అక్కడే నిల్చున్న సొధువు పక్షులు ఏం చేస్తున్నాయా అని చూడసాగాడు. సముద్రంలో చేపలేవీ కనపడటం లేదు. కానీ నీటిపై వాలడం ఎగరుకుంటూ పజవడం మళ్ళీ నీటిపై వాలడం చూసిన సొధువుకి ఐవి ఏం చేస్తున్నాయాని గ్రహించేందుకు ప్రయత్నించాడు. కళ్ళు మూసుకున్నాడు. తనకున్న దివ్యదకష్టితో పక్షులేం చేస్తున్నాయో గమనించాడు.మొత్తం విషయం బోధపడింది. పక్షి జంట బాధ తెలిసింది. తన దివ్యశక్తితో సముద్రంలో నీరు లేకుండా చేసి వాటికి గుడ్లు అప్పగించాలనుకున్నాడు.
అనుకున్న క్షణంలోనే సాధువు తన బలంతో చేతిని చాచాడు. కాస్సేపటికే సముద్రంలో నీరు కొన్ని అడుగుల దూరం వెనక్కుపోయింది. అలా నీరు వెనక్కంపోయిన క్షణంలో గూటితోపాటు గుడ్లూ కనిపించాయి. గుడ్లను చూడటంతోనే పక్షుల ఆనందం ఇంతా అంతా కాదు. సంతోషం పట్టలేక అరవసాగాయి. అవి గుడ్లను నోట కరచిపెట్టుకుని మరొక చోటుకి తీసుకుపోయాయి.
"నేనప్పుడే చెప్పేనా? మన శ్రమ వృధాకాబోదు అని.నీరంతా ఎండిపోయి మన గుడ్లు మనకు దక్కాయి" అని మగపక్షి గర్వపడింది.
సాధువు నవ్వుతూ ముందుకు సాగారు.
ఇక్కడ పక్షుల గుడ్లు దొరకడం వాటి స్వశక్తివల్లా? లేక సాధువు దయవల్లా? పక్షులకు సాధువు తపోబలం గురించి ఒక్క ముక్కా తెలీలేదు. అవి ఆత్మవిశ్వాసుతో నీటిని మరొకచోట కుమ్మరించడానికి ప్రయత్నించాయి.
ఒకవేళ పక్షులు తమ ప్రయత్నం చేయకపోయుంటే సొధువు తన మొనాన వెళ్ళిపోయేవారు.
అయితే ఆయన మనసుని ప్రభావితం చేసిందేమిటి? పక్షుల ఐవిశ్రాంత కృషి. కనుక గుడ్లు సురక్షితంగా బయటపడ్డాయి.
ఇందులో పక్షుల ప్రయత్నమూ లేకపోలేదు. సాధువు కరుణా లేకపోలేదు.
సాధువు కృప పక్షుల కృషికి తోడైంది. మొత్తంమీద ఈ వ్యవహారంలో పక్షుల కృషి మూలకారణం.
శక్తి, కృషి ముఖ్యం. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కృషి చేయాలి. యవ్వనంలో శక్తిని వినియోగించకుంటే వృద్ధాప్యంలో బాధపడాలి. ఒంట్లో ఓపికున్నప్పుడే చెయ్యవలసిన పనంలు బద్దకించకుండా చేయాలన్నదే అనుభవజ్ఞుల మాట. కనుక మేల్కోన్నప్పుడల్లా చైతన్యంతో పని చేసుకుపోవాలి. జీవితంలో ప్రతి క్షణమూ మంచి సమయమే. శ్రమించని వేళే సోమరితనం. కనుక ప్రణాళిక ప్రకారం చెయ్యవలసిన పని చేసుకుంటూపోవాలి.
కోకిల రంగు నల్లనే. అయితేనేం మంచి స్వరముంది. నెమలికి అందమైన పురి ఉంది. కానీ స్వరం లేదు. పొవురాన్ని శాంతికి చిహ్నంగా చెప్పుకుంటాం. కానీ దాని గొంతు భరించలేం. కర్ణకఠోరం. గాలికి రూపం లేదు. సూర్యుడికి నీడ లేదు. నీటికి రంగు లేదు. నిప్పుకి తడి లేదు. కొన్ని పువ.వులకు వాసన ఉండదు. కొన్నింటికి వాసన ఉంటుంది. సృష్టికర్త ప్రతి దానికీ ఒకటిచ్చి మరొకటి లేకుండా చేశాడు. అయితే ఒక్కొక్కదానికీ ఒక్కో కారణం ఉంది. అన్నీ ఉండి అన్నీ తెలిసే భగవంతుడు రాయల్లే ఉన్నాడు. అటువంటి దేవుడే అలా ఉంటే అల్పుడైన మనిషెంత? పూర్ణత్వం ఎక్కడుంటుంది? ఎవరి జీవితమూ పరిపూర్ణమైనదో కాదు. ప్రతి జీవిలోనూ ఏదో ఒక లోటు ఉండే తీరుతుంది. అది తెలుసుకుని సరిపెట్టుకోక తప్పదు. కాదూ కూడదూ అంటే ఆసంతృప్తితో చింతించాల్సిందే.
ఎవరూ పరిపూర్ణులు కారు--- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి