విద్య దాని పరమార్థం: --నేటి కాలంలో పై చదువుల కోసం తమ పిల్లల్ని తల్లిదండ్రులు రకరకాల ఉద్యోగాల్లో చేర్పించడం కోసం ఫౌండేషన్ అంటూ లేక వివిధ రకాల కౌన్సిలింగ్ సెంటర్లు అంటూ చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పిల్లలు ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారో లేదో తల్లిదండ్రులు గ్రహించడం లేదు. దీనికంతటికీ కారణం ఉన్నత చదువులపై మొగ్గు... ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని తల్లిదండ్రుల కోరిక...అసలు విద్య అంటే దాని ప్రాముఖ్యత అంటే ఒకసారి తెలుసుకుందామా మరి..!!విద్య పరమార్ధం విజ్ణానమే కాని “ఉద్యోగం” కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.పూర్వకాలంలో ఉద్యోగం చేసిన వాళ్ళ జీవన విధానంలో ఆర్థిక పరమైనటువంటి విషయంలో వారి యొక్క కుటుంబ పోషణకే కష్టంగా ఉండేది. కానీ నేటి కాలంలో అది విరుద్ధంగా మారింది. కారణం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు పెరిగిన సందర్భంగా కంప్యూటర్ మరియు కొన్ని బహుళజాతి కంపెనీల యొక్క నూతన పథకాల ద్వారా ఉద్యో గాలను కొత్త కోణంలో ఈ ప్రపంచానికి పరిచయం చేయటం ఉన్నతమైన ఆకర్షణీయమైన జీవితాలను గడప వచ్చని సాక్షాత్కరించడం జరిగినది. ఆత్మీయ -చిటికెన కిరణ్ కుమార్


కామెంట్‌లు