పోషకాహారం తగ్గినప్పుడు వచ్చే బలహీనత : నివారణ : - పి .కమలాకర్ రావు

పోషకాహార లోపం వచ్చినప్పుడు మంకు తెలియకుండానే ఒక రకమైన నిస్సత్తువ శరీరానికి ఆవహిస్తుంది. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. కొన్ని దినుసులను ఉపయోగించి మనం పోషక లోపాన్ని సరి చేసుకోవచ్చు. సమాన భాగాల్లో ఉలవలు, రాగులు మినుములు , గోధుమలు, పెసలు, నువ్వులు, శనగలు, బియ్యం, జొన్నలు.. ఈ తొమ్మిది రకాల ధాన్యాలు తీసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు , బాదం పప్పు , యాలకులను వేయించి పొడి చేసి పై వాటిలో కలుపుకొని నిలువ చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలుపుకుని తాటి బెల్లం , లేక బెల్లం కలిపి ప్రతి రాజు తాగితే శారీరక శక్తి పెరికి ఉత్సాహంగా వుంటారు. ఇది చిన్న పిల్లలు , పెద్దవారు అందరూ వాడవలసిన శక్తి వంతమైన పోషకాహారం .


కామెంట్‌లు