గోల్కోండ కవుల సంచిక తెచ్చిన మహానీయులు సురవరం ప్రతాపరెడ్డి - కవి ఉండ్రాళ్ళ రాజేశం

తెలంగాణలో కవులే లేరన్న మాటలకు బదులుగా 354 మంది కవులజీవిత చరిత్ర లతో కూడిన రచనలను *గోల్కొండ కవుల సంచిక* పేరుతో తీసుకవచ్చిన మహానీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని కవి ఉండ్రాళ్ళ రాజేశం, ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నం భూపాల్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ  ప్రతాపరెడ్డి అనేక కవితలు కథలు వ్యాసాలు రచించడమే కాకుండా పత్రికా సంపాదకులుగా సమాజ చైతన్యానికి పాటుపడ్డారని అన్నారు. ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథానికి తెలంగాణలో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందన్నారు.తెలంగాణలో నిజాం నిరంకుశ పరిపాలనకు ఎదురు నిలవడమే కాకుండా కలంతో సమాధానం ఇచ్చారన్నారు. గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొని గ్రంథాలయాల స్థాపన కోసం పాటు పడ్డారని, శాసనసభ్యులుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన సురవరం ప్రతాపరెడ్డి బాటలో అందరం సాగాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కవులు కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, యు. తిరుపతి  పాల్గొన్నారు.


కామెంట్‌లు