ఆనంద మార్గం-గురు ఉపదేశము-మణిదీప్ రెడ్డి

ఒక మునికి ఒక ప్రశ్న మనసులో మెదిలింది 
 అది ఏమిటంటే మనిషి ఆనందాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని. 
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగల తనకి కావలిసిన గురువు కోసం అని ఎక్కడెక్కడో తిరుగుతూ వెతుకుతూ అలసిపోయి ఒకచోట ఆగి విశ్రాంతి తీసుకుంటున్నాడు.
 ఆ పక్కనే ఒక పెద్ద ఆటస్థలం అక్కడ ముగ్గురు  పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ ముని  వారిని వారి ఆటలను  చూస్తూ  వారి ఆనందాన్ని ఈయన  కూడా అనుభవిస్తూ  నిలుచుండిపోయారు  
కాసేపు తరువాత ఆ పిల్లల్ని  పిలిచారు  
పిల్లలు వచ్చారు ఈయన వేషధారణ  వారికి వింతగానూ  కాస్త  నవ్వును  తెప్పించాయి  
పిల్లలు, మీరు రోజు ఇలా ఆడుకుంటూ ఉంటారా  అని అడిగారు  
అవును అయ్యా  అన్నారు పిల్లలు 
ఒక పిల్లాడితో  ఇలా ఆడుకోవడం  వల్ల లాభం  ఏంటని అడిగారు స్వామి  
ఆ పిల్లాడు ఆడుకోవడం వల్ల నేను ధృడంగా తయారవుతాను  శక్తివంతుడిని  అవుతాను  అప్పుడు నేను ఎవర్నీ చూసి భయపడాల్సిన  అవసరం లేదు అన్నాడు.
ఆ పిల్లాడి జవాబుకి  సంతోషించి  భవిష్యత్తులో నీవు పెద్ద మల్లయుద్ధ వీరుడివి  అవుతావు  అని ఆశీర్వదించారు. 
అదే ప్రశ్న  మరొక కుర్రాడిని  అడగగా 
కాసేపు ఆడుకున్నాక  మనసు విశ్రాంతి పొందుతుంది కాళ్ళు చేతులు  కడుగుకుని పుస్తకం  పడితే బాగా  చదువు  బుర్రకెక్కుతుంది  అన్నాడు 
ఆ పిల్లాడి జవాబుకి  సంతోషించి  భవిష్యత్తులో  నీవు చదువులో ఉన్నత స్థానాన్ని అందుకుంటావని ఆశీర్వదించారు
అదే ప్రశ్న చివరి కుర్రాడిని  అడగగా 
నాకు ఆటలంటే  ఇష్టం అందుకే ఆడుకుంటున్న  అన్నాడు  
అతడి జవాబుకి ఆశ్చర్య  పోయిన  స్వామి  
అతనికి నమస్కరించి  ఇక పై నీవే నా గురువువి  అన్నాడు.
 ఆ జవాబు తో ఆ మునికి అర్థమైన నీతి ఏమిటి గురువుగా ఎందుకు ఎంచుకున్నాడు అంటే..... 
మనిషి ఏదైనా చేసేప్పుడు  ప్రతిఫలం  ఆశించకుండా  చేస్తేనే  పూర్తి సంపన్నుడు అవుతాడు  చేసే ప్రతి పనిలోను ఫలం ఆశించి చేస్తే అది అందనపుడు  నిరాశకు లోనవుతాడు. ఆనందాన్ని పోగొట్టుకుంటాడు దుఃఖానికి చేరువవుతాడు. 
ఏదైనా ఇష్టంతో చేయాలి, దేనినీ ఆశించి కాదు అని తెలుసుకున్నాడు. ఆనందానికి మార్గం చూపిన వాడే గురువు అని ఆ పిల్లవాడిని గురువుగా స్వీకరించాడు..............                          -       శ్రీ  వినాయక  చవితి  శుభాకాంక్షలు .....                   -      శ్రీ  గణేశాయ నమహ.
మీ
మణిదీప్ రెడ్డి
ఇంటర్ రెండవ సంవత్సరం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
బాదేపల్లి


కామెంట్‌లు