కార్డ్ రాసినా
కబురూపంపినా
క్షేమం తెలిపినా
పాత చింతకాయ
పచ్చడి కిందే!
మాటలు నేర్పే
కళాశాలలు ఆధునిక పరికరాల విన్యాసాలు
ఇప్పుడిది ఒక మిషన్
పదుగురాడు మాట
పాటియై ధరజిల్లు
సంభాషణ ఒక సజీవకళ
ఒక్క ఆత్మీయ సంబోధన వివేకానందమయమై
యావత్ప్రపంచాన్ని
అస్తిత్వ సందేహం లో పడేసింది
కుగ్రామ మైన కుబేర రాజ్య మైనా
ప్రపంచంలో సెల్ దే హల్ చల్
తేనెలొలుకు పలుకులు
తెగే బంధాన్ని
కలుపు గొలుసులు
భ్రుకుటి ముడుపే
నిరసన నినాదం
ఎత్తిన అంబేద్కరుని
చేతివేలు సమస్తం సమీకరించి
అసమానత పై యుద్ధం ప్రకటించింది
వడికే రాట్నమే
తెల్లదొరల పై
నిరసనయ్
వణికించింది
ప్రస్తుతం
సాఫ్ట్ స్కిల్స్
హార్డ్వేర్ లోనే
నిక్షిప్తమైనాయి
ఏ స్కిల్
అయినా మనసుకు
అనoదపు థ్రిల్ కలిగించాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి