పిండి కూర-1 దివ్యమైన ఔషధము పి . కమలాకర్ రావు

తెల్ల తెల్లని పూలతో చిన్న చిన్న మందమైన ఆకులు కలిగి ఉండే కూర కొండ పిండి కూర . దీని పువ్వును నలిపితే పిండి పదార్ధం లాంటిది పొడి పొడిగా రాలి పడుతుంది. ఈ మధ్య కూరగాయల మార్కెట్ లలో విరివిగా దొరుకుతుంది. ఇది విలువైన ఔషధ గుణాలు కలిగి ఉంది. ముఖ్యంగా ఇది మూత్ర పిండాలలో రాళ్లు రానివ్వదు . ఒక వేళ ఉన్నా కరిగి పోతాయి. దీని ఆకులతో చట్నీ చేసుకుని తిన వచ్చు లేదా ఆకులతో టొమాటో తో పాటుగా ఉల్లి వెల్లుల్లి వేసి కూరగా చేసి తినవచ్చు . మూత్ర పిండాలకు సంబంధించిన ఇతర వ్యాధులను కూడా రానివ్వదు . . దీని చెట్టు అన్ని భాగాలు అంటే ఆకులు + పూలు + కాండం + వేరు కడిగి ముక్కలుగా చేసి నీటిలో వేసి కషాయంగా కాచి చల్లార్చి తాగితే మూత్ర కోశం వాపు తగ్గి, రక్తం లో , మూత్రం లో చక్కర శాతం కూడా తగ్గుతుంది.


కామెంట్‌లు