సుమతీ శతకం పద్యం (౧౦౭-107)

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ ! సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు ! కరణిని సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ.....
*కరి = ఏనుగు; కరణిన్ = తెలియ కుండా*
కొబ్బరి కాయ / కొబ్బరి బోండం లోకి తీయటి చవులూరించే నీరు మనకు తెలియకుండా ఎలా చేరుతుందో,  అలాగే సంపద మనింటికి చెప్పా పెట్టకుండా వస్తుంది.  వెలగపండును ఏనుగు తిన్నప్పుడు, చాలా సులభంగా, పండు పగలకుండా,  లోపలి  గుజ్జును తినేసి పైని చెక్కును వదిలేస్తుందో, అలాగే మన వద్ద వున్న సంపద కూడా వులుకు పలుకు లేకుండా మనల్ని విడిచి వెళ్ళి పోతుంది ..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*ప్రాణం మన లోపలకు మనకు తెలియకుండా వస్తుంది. మనకు చెప్పకుండా మనల్ని వదలి వెళ్ళి పోతుంది. (తొలి స్నానం గుర్తు లేదు - చివరి స్నానం తెలియదు; చా.ప్రా.) అలాగే డబ్బు, లౌకికమైన సంపదలు ఎంత నిశ్శబ్దంగా వస్తాయో, అంతే నిరపేక్షగా వెళ్ళి పోతాయి.  కాబట్టి దేహానంతర ప్రయాణానికి ఏవిధంగాను వుపయోగ పడని ఈ చంచలమైన డబ్బువెనుక పరుగెత్తక, శాస్వతమై, చిరంతనంగా వుండే పరాత్పరుని కర చరణాలు పట్టుకుని, కడతేరే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss


కామెంట్‌లు