చదరంగం ఇష్టం -వసుధారాణి

చిన్నప్పుడు ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదరంగం ఆటను బాగా ఆడేదాన్ని. ఆ ఉత్సాహంతో రెండు మూడు జిల్లా స్థాయి పోటీలకు కూడా వెళ్ళాను. నాకంటే వయసులో పెద్ద వాళ్ళయిన వాళ్ళను ఓడించటం మహా కిక్కు నిచ్చేది.
అప్పుడు రష్యా ఆటగాళ్ల పేర్లు ,వాళ్ళు వేసే ఎత్తులు కూడా తెలుసుకునేంత ఆసక్తి ఉండేది.ఆటని మొదలుపెట్టే రకరకాల విధానాలు కూడా సాధన చేసిన రోజులు.
జిల్లాస్థాయి బహుమతులు కూడా గెలుచుకున్నా..ఎందుకు నేర్చుకున్నానో, అలాగే ఎందుకు మానేసానో !
ఏదీ ఎక్కువ సేపు మోయలేని బాల్యం.
మీ దురదృష్టం! నేను కనుక అలా కొనసాగి ఉంటే ఇలా ఇదిగో ఈ హంపి కాకున్నా, మా గుంటూరు పక్క కొండవీడన్నా ఐ ఉండేదాన్ని.అలా కాకపోవటం వలన కవయిత్రినైతిని ..
PS: అసలా ' గ్రాండ్ మాస్టర్' టైటిల్ వినటానికే ఎంత గ్రాండ్ గా ఉండేదో


కామెంట్‌లు