150. పదవీవిరమణ తరువాత: - బెలగాం భీమేశ్వర రావు

 :2010 ఆగష్టు 1న పదవీవిరమణ వీడ్కోలు జరిగింది. ఫంక్షన్ కు వచ్చిన మా పిల్లలు నాలుగురోజులు మాతో గడిపారు. మ మనవరాళ్ళు
పూర్వి,పాయల్, లాస్య లు చాలా సందడి చేశారు.పిల్లలు ఎవరింటికి వాళ్లు వెళ్ళాక ఇల్లు బోసిపోయింది!ఉద్యోగ విరమణానంతర జీవితం
ప్రారంభమయింది!పదిరోజులు వరకు నా ఆలోచనలు రచన వైపు వెళ్ళలేదు.కొత్త ఆలోచనలు కలగలేదు. మరికొన్ని రోజులు అలా
గడిపాక ఒక ప్రణాళిక వేసుకున్నాను. పాఠశాలవిధులెలా కాలనిర్ణయ పట్టిక ప్రకారం కొనసాగాయో అలాగే రచనలు చేయడం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాను.ఉదయం పూట రాయడం మధ్యాహ్నం పూట చదవడంప్రారంభించాను.పాతతరం బాలసాహితీవేత్తల
పుస్తకాలు పరిశీలనాత్మకంగా చదివాను. కొత్త ఆలోచనలకు రచనాతీరులకు పుస్తక పఠనందోహదపడింది. బాలసాహిత్యంలో ఉన్న అన్ని
ప్రక్రియలలో రచనలు చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నాను.బాలసాహిత్య రచనను ఒక బాధ్యతగా స్వీకరించాను.సమాజానికి నేను చేయవలసిన సేవ  బాలసాహిత్య సృజన అనితెలుసుకున్నాను. 151.చిన్న చిన్న పాటలు:నాలుగు పాదాలు మాత్రమే ఉన్న గేయాలు
ఆరంభించాను. ఆ రోజుల్లో ఈనాడు హాయ్ బుజ్జీలో "చిలిపి కవిత" పేరుతో చిన్న గేయాలు కొన్నాళ్ళు ఇచ్చారు. రెండు గేయాలు 2010
మొదట్లో నేను పంపినవి వచ్చాయి. మొదటి గేయం"మా బాబు"ప్రచురణ ఫిబ్రవరి 3.
//బుద్ధి లోన రాముడు/గడుసులోన కృష్ణుడు/
భలే భలే బుడుతడు/మా ఇంటి బాలుడు//
మరో గేయం పేరు "గడసరి"!ప్రచురణ ఫిబ్రవరి24.
//అమ్మమ్మొచ్చి అటుకులు పోసె/అమ్మా వచ్చి 
బెల్లం వేసె/అక్కా వచ్చి రెండూ కలిపె/చక్కా మెక్కి
చెల్లీ వెళ్ళె//ఇలాంటి పాటలు రెండు మూడేళ్ల లో
అప్పుడప్పుడు 240 వరకు తయారు చేశాను.ఆ బుజ్జి బుజ్జి గేయాలు బాలబాట,నాని,భక్తి సమాచారం పత్రికలలో వచ్చాయి. బాలప్రపంచం పేరుతో పుస్తకం రావచ్చు! ఒక ప్రముఖ ప్రచురణసంస్థ వారి పరిశీలనలో ఉంది!(సశేషం)