152. మాట తీరు చెప్పే గేయం:--బెలగాం భీమేశ్వరరావు9989537835.

మాట తీరు పిల్లలు తెలుసుకోవాలి.రకరకాలుగామనం మాట్లాడతాం.మనం ఆడే మాటలు మనవ్యక్తిత్వాన్ని బయటపెడతాయి.బయటకు వచ్చినమాటను వెనక్కి తీసుకోలేం!ఎటువంటి మాటలుమాట్లాడాలి,ఎటువంటి మాటలు మాట్లాడరాదుఅనే విషయం పిల్లలకు చెప్పడానికి "మాట" పేరుతో గేయం చుక్ చుక్ రైలు సంపుటి కోసంరాశాను.//ఏది మంచిది?ఏది మంచిది?/తోటి
మనిషిని ఊరడించే/మాట మంచిది!మాట మంచిది!!//ఏది చెడ్డది?ఏది చెడ్డది?/తోటి మనిషిని బాధ పెట్టే /మాట చెడ్డది!మాట చెడ్డది!!//ఏది తీపిది?ఏది తీపిది?/తోటి మనిషిని ప్రోత్సహించే/మాట తీపిది!మాట తీపిది!!//ఏది
చేదుది?ఏది చేదుది?/తోటి మనిషిని కించపరచే/
మాట చేదుది!మాట చేదుది!!//ఏది నెమ్మది?
ఏది నెమ్మది?/తోటి మనిషిని శాంతపరచే/మాట
నెమ్మది!మాట నెమ్మది!!//ఏది దురుసుది?ఏది
దురుసుది?/తోటి మనిషిని రెచ్చగొట్టే/మాట 
దురుసుది!మాట దురుసుది!!//ఏది గొప్పది?
ఏది గొప్పది?/తోటి మనిషికి మేలు చేసే/మాట
గొప్పది!మాట గొప్పది!!//  153.సరదా గేయాలు:
ఒక అబ్బాయి తాతగారింటికి వెళ్లి అక్కడ తానే
గొప్ప అని చెప్పుకొనే గేయం"అపరశాంతుడు"!
చిన్న పిల్లలకు రక్తసంబంధీకులను ఎలా పిలవాలో
ఆ పేర్లను నేర్పడానికి ఉపయోగపడే గేయమిది! 
//తాతయ్యకేమో లడాయెక్కువ!/అమ్మమ్మకేమో
బడాయెక్కువ/మామయ్యకేమో మరుపు ఎక్కువ/
అత్తయ్యకేమో అరుపులెక్కువ/మా నాన్నకేమో
చిరాకెక్కువ/మా అమ్మకేమో పరాకెక్కువ/మా చిట్టి చెల్లికి పంతమెక్కువ/చిన్ని నా ఒక్కడికే
శాంతమెక్కువ//ఈ గేయం విజయనగరం ఉపాధ్యాయ శిక్షణాసంస్థ వారు ప్రచురించిన
బాలల విజయం 2010 ఫిబ్రవరి సంచికలో వచ్చింది. మరో సరదా గేయం"ప్రయాణం"!
ఇప్పుడైతే ప్రతి పల్లెకు బస్సులు తిరుగుతున్నాయికాని పూర్వం రోజులలో ఎడ్ల బళ్ళు , పోతుల బళ్ళు తిరిగేవి.ఆ ప్రయాణం పిల్లలకు భలే సరదాగా ఉండేది. పట్నవాస పిల్లలు ఎడ్లబండి
ప్రయాణం చేసి పొందిన అనుభవమే ఈ గేయం!
//పట్నవాస పిల్లలేమొ/పల్లె చూడ వచ్చిరండి/
నాటుబండి ఎక్కి వారు/సంబరాన సాగెనండి//
జోడెద్దుల బండండీ/భలే భలే గుందండీ/బస్సు లేని ఊళ్ళుకండి/అదే మనకు దిక్కండీ//
బండితోలువాడి మాట/ఎద్దులు జవదాటవండి/
ఆగుమంటె ఆగునండి/పొమ్మంటే పోవునండి/
ఎడ్లకున్న మువ్వలేమొ/రవళిలు చిందించునండి/
మెడను ఉన్న గంటలేమొ/గణగణమని మ్రోగునండి//గతుకుల రహదారి మీద/గమ్మత్తుగ
కదులునండి/ఎంత దూర పయనమయిన/అలవోకగ పోవునండి//పల్లె బతుకు పల్లె పాట/
పరవశాన్ని యిచ్చునండి/పట్నవాస రొదే లేక/
ప్రశాంతముగ ఉండునండి//ఈ గేయం 
విజయనగరం జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థవారి బాలల విజయం 2010 మార్చి సంచికలోవచ్చింది.(సశేషం)