161.చందమామలో మరికొన్ని కథలు:బెలగాం భీమేశ్వరరావు,9989537835.

2011 ఏప్రిల్ లో వచ్చిన తాయెత్తు కథతో పాటుఆ సంవత్సరం జూలై నెలలో "చాదస్తాల యశోదమ్మ " అనే కథ వచ్చింది. సెప్టెంబరులో
"మెలకువ" అనే కథ వచ్చింది. అక్టోబర్ లో "ఔదార్యం" కథ వచ్చింది. చాదస్తాల యశోదమ్మకథ మూఢనమ్మకాల మీద రాశాను.కథలోకి
సంక్షిప్తంగా వెళ్తే... రామయ్య గోపయ్యలిద్దరూఅన్నదమ్ములు. వారి చిన్నతనం లోనే తండ్రి పోయాడు.తల్లి యశోదే వాళ్ళను పెంచసాగింది.ఆమెకు చాదస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువ.బడిఈడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె
బడికి పంపలేదు. బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం.ఆమెకు రామయ్యా గోపయ్యల కన్నా ముందుగా ఒక
కొడుకుండేవాడట.వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట.నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చనిపోయాడు.కాని యశోదమ్మ పిల్లాడికి
చదువొచ్చాక చనిపోయాడని నమ్మింది.అందువల్లేఆమె రామయ్య గోపయ్యలను బడికి పంపలేదు.రామయ్య గోపయ్యలు పెద్దవాళ్ళయ్యారు.కూలీనాలీ చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలోపెట్టేవారు. యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల 
పూజలు చేసేది. దేవతలకు మొక్కులు మొక్కేది.సోది చెప్పే వాళ్ళను ఇంటికి రప్పించి దానాలతోతృప్తి పరిచేది. ఎందుకమ్మా డబ్బునలా ఖర్చుపెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకుమంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది.కొడుకులిద్దరికీ పెళ్ళీడు వచ్చింది. పెళ్ళిళ్ళు చేసింది. కోడళ్ళు వచ్చారు. ఆమెకు బోలెడు విశ్రాంతి లభించింది. పూజల పిచ్చి ఎక్కువయింది.ఖర్చులు పెరిగాయి. అప్పులుతీర్చడానికి కొడుకులు సతమతమవసాగారు.పెద్ద కోడలు కమలకు అత్త చేసిన పనులు నచ్చలేదు.అత్త బుద్ధిని మార్చడానికి ప్రయత్నించింది.కోడలి ఆలోచనను పసిగట్టినయశోదమ్మ కోడలిని మందలించింది.కొడుకులువచ్చాక రభస చేసింది. రోజులు గడుస్తున్నాయి.ఇద్దరు కోడళ్ళు మగపిల్లలను కన్నారు.మనవలిద్దరికి బడివయసు వచ్చింది.యశోదమ్మ బడికి పంపవద్దంది.పిల్లల చదువువిషయంలో అత్తకూ పెద్ద కోడలికి మాటా మాటాపెరిగింది.చివరకు ఆ వాదన వేరుకాపురం వరకువచ్చింది. పక్క ఊర్లో రామయ్య కాపురం పెట్టకతప్పలేదు.భార్య ఇష్టప్రకారం కొడుకును బడికిపంపాడు.నాలుగు డబ్బులు కూడబెట్టి ఇల్లు కొన్నాడు.కమల ఇంటి పెరడులోకూరగాయల మొక్కలు వేసింది. తొందరగా కాపునకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది.యశోదమ్మకు ఆ విషయాలు తెలిశాయి. రామయ్యను పిలిచి "నీ భార్య నా మాటను లక్ష్యపెట్టలేదు.నా మనవడిని బడికి పంపిస్తుంది.పెరడులో కాయగూర మొక్కలు పెంచడం మనకుఅచ్చిరాదంటే అవి వేసింది. పెరడులో నేనుకాయగూర మొక్కలు వేసేటప్పుడు మీ నాన్నపోయాడు. నీవూ నీ కొడుకు చనిపోతారు"అనిరాగాలు తీసింది యశోదమ్మ. అప్పుడు రామయ్య"అమ్మా!ఇప్పుడు పిల్లలకు చదువు అవసరం.అందుకే కమల బాబును బడికిపంపుతుంది. నాన్న తాగి తాగి చనిపోయాడనిఊళ్ళో వాళ్ళు చెప్పారు. నువ్వు పాదులేయడంనాన్న చనిపోవడం కాకతాళీయం. సంపాదనలేకపోతే అభివృద్ధి ఉండదు.అందుకే కమలకాయగూరలు పండిస్తుంది"అని చెప్పేసరికి యశోదమ్మ తోక తొక్కిన పామే అయింది.కొడుకును కోపంతో పొమ్మంది.రామయ్యబాధపడుతూ ఇంటిదారి పట్టాడు.ఐదు సంవత్సరాలు గడిచాయి.రామయ్య కొడుకు 
తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. రామయ్య నాలుగు డబ్బులు వెనకేసి పొలంకొన్నాడు.తల్లి వద్ద ఉన్న గోపయ్యకు సంపాదన
సరిపోలేదు. కొడుకు చదువూ సామూ లేక జులాయి అయ్యాడు. అన్నయ్య బతుకు కంటేతన బతుకు ఎందుకు వెనకపడిందో గ్రహించాడు.తల్లి మూఢనమ్మకాలు,చాదస్తాలు ఆమెఅమాయకత్వం వల్ల ఏర్పడినవే అని తెలుసుకున్నాడు.ఒకరోజు తల్లితో "అన్నయ్య బాటలోనడుస్తానమ్మా!"అన్నాడు. యశోదమ్మ మొదటదిగ్భ్రాంతి పడినా ఆలోచించి"నీ ఇష్టం!మీ కొత్తఆలోచనలకు అడ్డురాను "అంది.గోపయ్య దంపతులు ఆనందించారు.అన్నయ్య కాపురంలాగే తమ్ముడి కాపురం కూడా బాగుపడింది.2011లో నేను చెన్నై వెళ్ళినప్పుడు చందమామకార్యాలయానికి మా అబ్బాయితో కలిసి వెళ్ళాను.అప్పుడు సంపాదకబాధ్యతను చూస్తున్న శ్రీ రాజశేఖర రాజు గారుచాలా ఆప్యాయంగా మాట్లాడారు.కథలు పంపండని కోరారు. పార్వతీపురం నుంచి మంచికథలే వస్తున్నాయని నారంశెట్టిఉ మామహేశ్వరరావుగారిని, బి.వి.పట్నాయక్ గారిని అడిగినట్టు చెప్పండని కోరారు. పాఠకులహృదయాలలో ఒక మంచి పిల్లల పత్రికగా శాశ్వతముద్ర వేసుకున్న చందమామ కార్యాలయంలోఅడుగు పెట్టడం ఒక మధురానుభూతే అయింది!(సశేషం)