162.గేయాల పందిరి:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.

తూర్పు దిక్కున పూర్తిగా తెల్లవారలేదు.సూర్యుడుపొడసూపే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో ఒక తల్లి తన బిడ్డను నిద్ర నుంచి లేపడానికి పాడే గేయమే"శుభోదయం"!
//వేగుచుక్కా నిన్ను/వేవేగ లెమ్మంది/తూర్పు దిక్కూ నిన్ను/త్వర త్వరగ రమ్మంది//చెరువులో
కమలాలు/చూడ రమ్మన్నాయి/విరబూయు
పూపొదలు/నిను చూడ పిలిచాయి//అక్కల్లు
అందరు/ చూడ వచ్చారమ్మ/అన్నల్లు అందరు/
ఆడవచ్చారమ్మ//లేవోయి పాపాయి/ లేవోయి బుజ్జాయి/ తొలి కోడి కూసింది/ తెలతెల్లవారింది//
ఈ గేయం 2011 అక్టోబరు 16 వార్త ఆదివారం లో
వచ్చింది.మరోగేయం"పిలుపు"!ఒక పాపాయి
అమ్మనెందుకు పిలుస్తుందో చూడండి. //అమ్మా అమ్మా రావే/ పాలూ నాకూ తేవే/ పాలూ నాకూ
ఇస్తే/ పిల్లీ కూనకు పోస్తా// అమ్మా అమ్మా రావే/
బిబ్బీ నాకూ తేవే/ బిబ్బీ నాకు ఇస్తే/ కుక్కా పిల్లకు
వేస్తా// అమ్మా అమ్మా రావే/ నూకలు నాకూ తేవే/
నూకలు నాకూ ఇస్తే/ బుల్లీ పిచ్చుక కిస్తా// అమ్మా అమ్మా రావే/ బొమ్మా నాకూ తేవే/ బొమ్మా నాకూ
ఇస్తే/ బుద్ధిగ ఆడూకుంటా//బాలల మనస్తత్వం
గేయం లో చూపడం జరిగింది.ఈ గేయం 2011
డిశంబరు 8 వార్త దినపత్రికలో వచ్చింది.ఇంకొక
గేయం "మా ఇంటి దేవతలు"! ఇంట్లో పిల్లలు
వారి అమ్మానాన్నల గురించి ఏమంటున్నారో
చూడండి. వారన్నది నిజమే.పిల్లలకు అమ్మానాన్నలే దేవతలు.ఎందుకు వారన్నారంటే...
కారణాలుంటాయి గదా!అవేమిటో చూద్దామా మరి!//మా అమ్మే ఒక దేవత/ మా నాన్నే ఒక దేవుడు/ మా ఇల్లే ఒక కోవెల/ మా గృహమే ఒక
స్వర్గము// అల్లరెంత చేసిననూ/ అమ్మెన్నడు
కోపించదు/ అవసరాలు కనిపెట్టి/ నాన్న గారు తీర్చి పెట్టు/ మా మంచీ చెడును వారు/ ఎంతగానో పరికించును/ మా బాగుకు వారేమో/ ఎంతగానో పరితపించు// అందువల్ల మా ఇంటిని/ ఒక కోవెలని అన్నాము/ అందులోని దేవతలే/ అమ్మా నాన్న లన్నాము//ఈ గేయం 2011
డిశంబరు17 వార్త దినపత్రికలో వచ్చింది. ఈ
గేయం శీర్షికతోనే విశాలాంధ్ర వారు నా బాలగేయ
సంపుటిని తెచ్చారు.నవంబరు లో వచ్చే బాలల
దినోత్సవం సందర్భంగా "చాచా నెహ్రూ"అనే
గేయం రాశాను.//జేజేలండీ జేజేలు/జవహరు
బాబుకు జేజేలు//భరత గడ్డపై పుట్టాడు/బంగరు
ఊయల ఊగాడు//పెద్ద చదువులే చదివాడు/
బారిష్టరుయే అయ్యాడు//జైలు జీవితం గడిపాడు/జాతిపితకు తోడయ్యాడు//జాతి శ్రేయస్సు కోరాడు/జాతికి స్వేచ్ఛను తెచ్చాడు//
పంచశీలను బోధించాడు/శాంతి మార్గమును
చూపాడు//తొలి ప్రధానిగ అయ్యాడు/ప్రాజెక్టులనే
తెచ్చాడు//పిల్లల ప్రేమను పొందాడు/చాచా నెహ్రూ అయ్యాడు//ఈ గేయం 2011 నవంబరు
భక్తి సమాచారం లో వచ్చింది.(సశేషం)