163.గేయకథలల్లిక: కాకి పెద్దది.చీమ చిన్నది.బెలగాం భీమేశ్వరరావు,9989537835.

శత్రువైన కాకితో చిన్న చీమ ఎలా ఆడుకుందో
"కాకి - చీమ"గేయకథ లో చూడండి. అదును
చూసి తెలివితో తనేమిటో తెలియపరచాలి.
//చీమచింత కొమ్మ పైన/బొట్ట ఉన్నది//బొట్ట పండి
పలుకులతో/ఊగు చున్నది//కాకి ఒకటి ఎగిరి వచ్చి/అచట వాలెను//బొట్ట చూస్తు లొట్టలేస్తు/
పొడవబోయెను//చీమ ఒకటి బొట్ట మీద/కనిపించగా/కాకి అంత దాన్ని మ్రింగ/పట్టబోయెను//ఒడుపుగాను చిట్టి చీమ/తప్పుకొన్నది//తగిన బుద్ధి చెప్పాలని/తలచుకొన్నది//బొట్ట తెంపి నల్లకాకి/ఎగరబోయెను//హుష్ అనుచు ఒక బాలుడు/
అటకు వచ్చెను//అదను కొరకు ఎదురు చూచు/
ఎర్రచీమకు//భలే భలే ఆలోచన/ఒకటి వచ్చెను//
కసిదీరా కాకినేమొ/చీమ కుట్టెను//కావుమంటు
కాకి అరచి//బొట్ట విడిచెను//సంబరపడి బాలుడంత/బొట్ట తీసెను//బొట్ట పోవ కాకి అంత/
గోల పెట్టెను//అన్ని పాదాలు మాత్రాఛందస్సులో
రాయబడ్డాయి.ఈ గేయకథ 2012  జూన్ 17
ప్రజాశక్తి దినపత్రికలో వచ్చింది. మరో గేయకథ
"కల"! కవి తనకొచ్చిన కలను పిల్లలకు చెప్పే
అంశం!//అందాల బాలలూ/అపరంజి బొమ్మలూ/వినరండి పిల్లలూ/కల ఒకటి చెబుతాను//కలలోన
కనిపించె/అందాల తోటొకటి/తోటలో వినిపించె/
తియ్యనీ పాటొకటి/పాట విని నేనంత/వెతికాను
తోటంత/పొన్న చెట్టూ చెంత/కనిపించె నొక కాంత//గొంతెత్తి పాడుతూ/ఆమె కనిపించింది/
సుద్దులను చెప్పుతూ/నన్ను దీవించింది//జాతి
వైషమ్యాలు/విడువమని పలికింది/జాతి సమైక్యతను/పెంచమని కోరింది//మత ద్వేషాగ్నులను/ఆర్పమని కోరింది/మత సహన
సుధలను/గ్రోలమని చెప్పింది//పనిలోని దైవమును/చూడమని కోరింది/పని చేసి సంపదను/పెంచమని చెప్పింది//దైవసేవకు మిన్న/గ్రామసేవే అంది/గ్రామ ఉద్ధరణయే/దేవునకు ప్రియమంది//సుద్దులను విని నేను/
పరవశుడనయ్యాను/చూచుచుండగ ఆమె/
అదృశ్యమయ్యేను//ఆమె ఎవరో కాదు/ఓ చిన్ని
పాపలూ/మనందరిని పెంచేటి/భరతమాతే ఆమె//ఈ గేయకథ 2012 జూన్ 24 న ప్రజాశక్తి
లో వచ్చింది. ఈ గేయకథ లో పిల్లలు మంచి భావిపౌరులుగా ఎదుగుటకు బుద్ధులు చెప్పే
ప్రయత్నం జరిగింది.(సశేషం)