నవరాత్రి --- యామిజాల జగదీశ్

సర్వలోక స్వరూపిణీ
ముల్లోకాల స్వరూపిణీ
త్రిగుణాలకూ 
మూలమైన సర్వలోకైక స్వరూపిణీ
తొమ్మిది రోజులూ 
వివిధ అలంకారాలతో 
పూజలందుకునే జగజ్జననీ
దుష్ట శిక్షణ
శిష్ట రక్షణగా అలరారే నవశక్తి స్వరూపిణీ
సర్వం శక్తిమయమని చాటి చెప్పే
నవరాత్రి తత్త్వార్థం తెలుసుకుని
తొలి మూడు రోజులు 
దుర్గాపరమేశ్వరిని
వీరం, ధైర్యాన్నీ కోరుతూ,
తర్వాతి మూడు రోజులూ మహాలక్ష్మిని
సకల సంపదలనూ కోరుతూ,
చివరి మూడురోజులూ సరస్వతీదేవిని
చదువుసంధ్యలు కోరుతూ
ఆరాధించే నవరాత్రి అందరికీ 
శుభాలిచ్చే రోజులు!!


భూలోకాన్ని పాలించే
పరమేశ్వరుడికి ఒక్క రాత్రే అది శివరాత్రి!!
కానీ 
అఖిలలోకాన్నీ రక్షించే శక్తికి
తొమ్మిది రాత్రులు అదే నవరాత్రి!!


శక్తి రూపాలను
ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞానశక్తిగా
అర్చించి 
సకల శుభాలూ పొందుదాం!!
అందరికీ
నవరాత్రి శుభాకాంక్షలు!!