కలబంద , అలోవెరా -2 ప్రయోజనాలు... పి. కమలాకర్ రావు

 కలబంద నుండే ముసాంబరం ని తయారుచేస్తారు. కలబంద పట్టాను అడ్డంగా కోసి తలకిందులు చేసి అందులోంచి కారిన రసాన్ని ఒక గిన్నెలో పట్టి ఎండలో ఉంచితే నల్లని ముద్ద లాంటి పదార్థం వస్తుంది దాన్నే ముసాంబరం అంటారు. చిన్న పిల్లలకు మలబద్ధకం వస్తే చిటికెడు ముసాంబరంలో చను పాలు కలిపి ఒక స్పూన్ తాగిస్తే విరేచనం అవుతుంది. చిన్న పిల్లలకు చనుబాలు మరిపించడానికిముసాంబరం ని అరగదీసి చనుమొనలపై రాస్తే పాలు త్రాగడం నిరాకరిస్తారు. చిన్న పిల్లలకు నులి పురుగులు ఉంటే కలబంద రసంలో పొంగించిన ఇంగువను కలిపి మూడు స్పూన్లు తాగించాలి విరేచనంలో పురుగులు పడి పోతాయి. నెల నెలా ముట్టు సమయంలో కడుపునొప్పి వస్తే కలబంద రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఒక వారం రోజులు త్రాగితే నొప్పి తగ్గిపోతుంది. ముఖంపై నల్లని మచ్చలు పోవడానికి కలబంద గుజ్జులో వెన్న కలిపి ముఖంపై రాసుకుంటే నల్ల మచ్చలు పోయి ముఖం కాంతివంతమవుతుంది. కాలిన గాయాలపై కలబంద రసం పూస్తే పుళ్ళు త్వరగా మానిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారు కలబంద రసంలో ఉసిరికాయ రసం కలిపి ప్రతిరోజు పరగడపున త్రాగితే కొద్దిరోజుల్లో బరువు తగ్గి సన్నబడతారు.