ఉత్పలమాల :
*కట్టడ లేని కాలమునఁ | గాదు శుభం బొరులెంత వారు చే*
*పట్టిననైన మర్త్యునకు | భాగ్యమురాదనుటెల్లఁగల్ల, కా*
*దెట్టని పల్కినన్; దశర | థేశ వశిష్టులు రామమూర్తకిన్*
*బట్టము గట్టకోరి రది | పాయక చేకురె నోటు భాస్కరా!*
*మర్త్యునకు = మనుష్యునకు ; పాయక = చెడిపోక*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
దశరధ మహారాజు, వశిష్ఠుడు వంటి వారు శ్రీరామచంద్ర మూర్తకి రాజ్య పట్టాభిషేకం చేయాలని అనుకున్నారు, కానీ దైవబలం లేక, అదృష్టం కలసిరాక పట్టాభిషేకం జరగలేదు కదా. అలాగే, ఎంతో గొప్పవారైనా, ఒక పనిని పూర్తి చేయాలి అని తలపెట్టినప్పడు, అదృష్టం కలసి వచ్చి, భగవంతుని అనుగ్రహం కూడా తోడై వుండాలి. లేకపోతే, ఆపని పూర్తి కాదు.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*"మనిషి అనుకుంటాడు, భంగవంతుడు నెరవేరుస్తాడు"* అని కదా నానుడి.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
భాస్కర శతకము* - పద్యం (౨౯ - 29)