టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ

ఆశ్రమం ముందు ఒక రాతి పలక మీద 'బాహ్య దృష్టికి కనిపించని దేవుడి ప్రార్థన మాత్రమే ఇక్కడ జరుగుతుంది'
అని రాసి పెట్టి వుంది.ఆశ్రమంలో వుండేవారు మూర్తి పూజ చేయకూడదనీ,ఇతర మతాలను నిందించకూడదనీ, ఆశ్రమంలో తిరిగే ఏ ప్రాణికి హాని చేయకూడదనీ, మూడు నియమాలు వున్నాయి.
తాతయ్య 1901 సంవత్సరంలో శాంతి నికేతన్ ఆశ్రమంలో పాఠశాల ప్రారంభించారు.ఆయన పాఠశాల ప్రారంభించడానికి కారణం చిన్న పిల్లలు అంటే ఆయనకు చాలా ఇష్టం.తన కుటుంబంలోనే చాలా మంది చిన్న పిల్లలు వుండేవారు.వాళ్ళందరు సంతోషంగా స్వతంత్రంగా విద్య నేర్చుకోవాలంటే వాళ్ళకు శాంతి నికేతన్ లాంటి ఆశ్రమం తప్పనిసరి అనుకొని,తన చిన్న తనపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల ప్రారంభించారు.
పట్టణాలలో నాలుగు గోడల మధ్య,కొయ్య బల్లల మీద బందించి పెట్టి నిర్బంధంగా బోధించే విద్య తాతయ్యను కలవర పెట్టేది.విశాల ఆకాశంలో స్వేచ్చా పక్షి లా విహరిస్తూ, అభిరుచికి తగ్గట్టుగా అనేక విషయాలు నేర్చుకోవాలని తాతయ్య ప్రయత్నిస్తుండేవాడు.తాను మొదటి సారి ఆశ్రమం వచ్చినపుడు,ఎంత స్వేచ్ఛగా అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉత్సాహంగా వుండేవాడో, పిల్లలు కూడా అదే ఉత్సాహంతో, స్వేచ్ఛగా గడపాలని ఆయన కోరుతుండేవాడు.తాను ప్రారంభించే పాఠశాలలో విద్యార్థులు కృషి ప్రధానమైన విద్యను స్వతంత్రంగా నేర్చుకోవాలని ఆయన కల.--మిగితాది రేపు.....