ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు యలమర్తి అనురాధకి ఆహ్వానం

అక్టోబర్ 10వ తేదీ రాత్రి 9:30 కు అంతర్జాలంలో న్యూజిలాండ్ నుంచి అమెరికా  దాకా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు  నాలుగవ వేదికకు  వక్తగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ ఆహ్వానించబడ్డారు. రాధిక నోరి నిర్వహణలో ఈ సభ నిర్వహిస్తారు.
సంస్థ ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు గారి  ఆధ్వర్యంలో "సాహితీశిఖరేంద్రుడు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ" గారి గురించి అనూరాధ ప్రసంగించనున్నారు. 
    ఇదే సదస్సులో ప్రారంభ వక్తగా శ్రీ ఆచార్య s. v.సత్యనారాయణ గారు ,మరో ప్రముఖ డాక్టర్ సాహితీవేత్త డాక్టర్ శర్మ వేదుల శ్రీరామ శర్మ (శిరీష )హాస్యబ్రహ్మ శంకరనారాయణ తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు.    
   అంతర్జాలం లో జరిగే ఈ సదస్సులో జోహన్స్ బర్గ్ , అమెరికా, సింగపూర్,మెల్బోర్న్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే , హోస్టెన్, ఇండియా తెలుగు సమాఖ్యలు కార్యనిర్వాహకత్వం వహిస్తున్నాయి.


యలమర్తి అనూరాధ