కలబంద, అలోవెరా -3 ప్రయోజనాలు-- పి . కమలాకర్ రావు

అలోవెరా గుజ్జు కొద్ది చేదుగా ఉంటుంది. తేనెతో కలిపి ప్రతి రోజు తింటే శరీరానికి మంచి బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. స్త్రీలకు గర్భాశయానికి మంచి రక్త ప్రసరణ జరిగి కండరాలను గట్టిపరుస్తుంది. స్త్రీలకు స్థనా ల్లో ట్యూమర్స్ వస్తే కలబందను నిలువుగా కోసి వేడి చేసి స్థనాలపై కడితే కొద్దిరోజుల్లో ట్యూమర్ కరిగిపోతుంది. క్యాన్సర్ వ్యాధి తగ్గడానికి గోధుమ గడ్డి రసంలో అలోవెరా గుజ్జు కలిపి ఉదయం సాయంత్రం తినిపిస్తే క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మగవారికి ప్రోస్టేట్ సమస్య వస్తే మూత్ర ధారా సన్నబడుతుంది.. కలబంద రసంలో కొద్దిగా నల్ల నువ్వుల నూనె బెల్లం కలిపి తినిపిస్తే మూత్రం ఫ్రీగా వస్తుంది. మొలల వ్యాధి లో రక్తం పడుతుంటే కలబంద రసంలో చక్కెర కలిపి తినిపించాలి. కలబంద గుజ్జును క్రింద ఆసనంపై వేసి కట్టు కట్టాలి మొలల వ్యాధి తగ్గిపోతుంది సియాటికా నొప్పి వచ్చినప్పుడు అలోవెరా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి లేపనంగా పూస్తే నొప్పి తగ్గిపోతుంది