భాస్కర శతకము - పద్యం (౩౦ - 30)

ఉత్పలమాల :
 *కానగ చేరఁబోలఁ దతి | కర్ముండు నమ్మిక లెన్ని చేసినం*
*దా నది నమ్మి వానికడ | డాయఁగ బోయిన హాని వచ్చు న*
*చ్చో నదియెట్లనం; గొరఁకు | చూపుచు నొడ్డినబోను మేలుగాఁ*
*బోనని కాన కాసపడి | పోవుచుఁ గూలదెఁకొక్కు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 చెడ్డపనులు చేయువాడు, చెడు బుద్ధి కలవాడు తనపైన నమ్మకం కలగడానికి ఎన్నో మాటలు చెపుతాడు. ఆమాటలు నమ్మి వారి వద్దకు వెళ్ళకూడదు. అలా వారి వద్దకు వెళితే, వెళ్ళిన వారికి ఇబ్బందులు తప్పవు.  ఎలాగంటే, పందికొక్కును పట్టుకోడానికి మనం బోను పెట్టాము అనే విషయం అర్ధం చేసుకోకుండా, ఆ బోనులోకి వెళ్ళి చిక్కుకొని చంపబడుతుంది కదా, అలా.... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మన చుట్టూ వున్న వారు మనలను క్రింద పడేయడానికి లేదా పతనానికి ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారో తెలుసుకుని, అటువంటి వారి దగ్గరకు మనం వెళ్ళ కుండా, వారిని మన దగ్గరకు రానీక జాగ్రత్తగా వ్యవహరించాలి* అని భావం. 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss