భాస్కర శతకము - పద్యం (౩౮ - 38)

చంపకమాల : 
*ఘనుడగునట్టిఁవాడు నిజ | కార్య సముద్ధరణార్ధమై మహిం*
*బనివడి యల్ప మానవునిఁ | బ్రార్ధన జేయుట తప్పుగాదుగా,*
*యనఘఁత గృష్ణజన్మున | నావాసుదేవుఁడు మీదు టెత్తుగా*
*గనుగొని గాలిగానికడ | కాళ్ళకి మ్రొక్కఁడె నాడు భాస్కరా!*


తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!


శీకృష్ణ పరమాత్మునికి తండ్రి యై కూడా శ్రీకృష్ణ జనన సమయంలో చెరసాలలో వున్న వాసుదేవుడు కృష్ణుని బుట్టలో వుంచి తలపై పెట్టుకొని, కంసుని నుండి తన బిడ్డను రక్షించు కోడానికి వెళతూ, దారిలో అడ్డుగా వచ్చిన గాడిద వెనుక కాళ్ళను పట్టుకొని, శబ్దం చేయవద్దని ప్రార్ధిస్తాడు.  అలాగే మనుషులు కూడా ఎంత తెలివైనవారు, బుద్ది కుశలత, బలగాలు వున్నవారు అయినా, తాము అనుకున్న పనిని సాధించడానికి, ఒక మంచి ఫలితం పొందడానికి,  అవసరమైతే ఒక బలహీనుని సహాయం కోరడం, పొందడం తప్పు కాదు...... అని భాస్కర శతకకారుని వాక్కు.
*మనలో  ఎంత సామర్థ్యం వున్నా, ఎదుటి వారిని తక్కువ గా చూడకుండా అందరినీ కలుపుకుని పోతూ, పనులు చక్క బెట్టుకోవడం, మంచి ఫలితాలు రాబట్టడం తెలివైన వారి లక్షణము* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss