కలబంద, అలోవెరా -4 ఆహారంగా.. : పి . కమలాకర్ రావు

ఆయుర్వేద వైద్య విధానంలోని గొప్పతనం ఏంటంటే ఔషధంగా వాడే చాలా మూలికలు ఆహారంగా పనికి వస్తాయి, ఏవో కొన్ని తప్ప. ఇతర ఏ వైద్య విధానంలో ఇలా జరగదు. ఇప్పుడు మనం   అలోవెరా గుజ్జు తో భోజనంలో వాడుకునే రుచికరమైన పొడిని తయారు చేసే విధానం తెలుసుకుందాం. రెండు మూడు పొడవైన అలోవెరా పట్టాలను తెచ్చి పక్కనున్న ముళ్ళు తీసివేసి గుజ్జును సేకరించి ఒక గాజు పాత్రలో వేయాలి. అందులో కొద్దిగా పసుపు తగినంత   సైంధవ లవణం వేసి కలిపి మూతపెట్టి ఎండలో ఉంచాలి మళ్లీ రాత్రి ఇంట్లో పెట్టాలి మరు రోజు ఉదయం బాగా కలిపి ఎండలో ఉంచాలి ఇలా మూడు రోజుల తర్వాత అందులో తగినంత కారం పొడి కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి పొంగించిన ఇంగువ పొడి, వాము పొడి, సొంటి పొడి, మిరియాల పొడి, లవంగాల పొడి, నల్ల జీలకర్ర పొడి యాలకుల పొడి నల్ల ఆవాల పొడి వేసి బాగా కలిపి మళ్లీ ఎండలో పెడుతూ ఉండాలి, ఇది పూర్తిగా ఎండిపోయి పొడిగా తయారవ్వాలి. ఇది తయారవడానికి ఓ వారం రోజులు పట్టవచ్చు. ఆ తర్వాత నిల్వచేసుకోవాలి. దీనిని భోజనంలో ఆవు నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యప్రయోజనాలను కలుగజేస్తుంది. ఇది శరీరంలోని. వాత,   పిత్థ, కఫాలను సమన్వయ పరుస్తుంది కాబట్టి దీనిని అందరూ వాడి అలోవెరా ను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి ఆరోగ్యాన్ని పొందాలి. ఇష్టమైనవారు దీనిని వండిన కూరలు పైన లేదా పప్పు పైన వేసుకొని తినవచ్చు