కలబంద -అలోవెరా.. ప్రయోజనాలు. -- పి . కమలాకర్ రావు

అలోవెరా సౌందర్యసాధనంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఎన్నో వ్యాధులలో కూడా దీన్ని ఔషధంగా వాడతారు. విపరీతమైన తల నొప్పి లేస్తే అలోవెరా గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి నొసట రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. కళ్ళకలక వస్తే దీని గుజ్జును కళ్ళ పైన రాసుకుంటే తగ్గిపోతుంది. కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువైనప్పుడు కొద్దిగా అలోవెరా గుజ్జు, కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా కరక్కాయ పొడి మరియు సైంధవ లవణం కలిపి తినిపిస్తే కడుపు లోని గ్యాస్ బయటికి నెట్టబడుతుంది. కీళ్ల నొప్పులు ఎక్కువ అయినప్పుడు అలోవెరా గుజ్జులో ఆవనూనె కలిపి నొప్పుల పై లేపనం చేయాలి ఆ తర్వాత కాపు కోవాలి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఉత్తర భారతదేశంలో అలోవెరాతో లడ్డు తయారు చేసుకొని తింటారు.. అలోవెరా ఆలుగడ్డ కర్రీ చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల లివర్ సమస్యలు తగ్గుతాయి జీర్ణక్రియ బాగుపడుతుంది.