టాగూర్ తాతయ్య -ప్రమోద్ ఆవంచ

తాతయ్య ఆశ్రమ పాఠశాలను సరికొత్తగా సిద్దం చయదలిచాడు.కానీ ఆ పురాతన పద్దతిలో కాదు.ఉత్సాహం కార్యక్రమం ఒకటే అయినప్పటికీ బాహ్య రూపం మాత్రం ప్రస్తుత సమాజ పరిస్థితులకు సరిపోయేటట్లు ఏర్పాటు చేయదలిచాడు.
               తాతయ్య తన పాఠశాలలో అనేక ఉత్సవాలను జరిపిస్తూ వుండేవాడు.శరత్కాలంలో శరదోత్సవం, ఫాల్గుణ మాసంలో ఫల్గుణి, వసంతంలో బసం,అనే డ్యాన్స్ డ్రామాలను రాసి, బాలబాలికల చేత ప్రదర్శింపజేస్తుండేవాడు.వాళ్ళకు గానం, వాద్యం, నృత్యం, చిత్రలేఖనం, అన్నీ నేర్పుతుండేవాడు.
                     డాక్ ఘర్ అనే నాటకాన్ని రాసి,పిల్లలతో వేయించాడు.ప్రత్యేకంగా బాల నటుల కోసం రాయబడిన ఈ నాటకం రవీంద్రునికి చాలా ప్రియమైనది.రవీంద్రుడు(తాతయ్య), తాను నిర్మించిన ఆశ్రమ పాఠశాలను,స్వంత ఇంటి వాతావరణంతో సమానంగా వుండేటట్లు, పిల్లలు పరిసర ప్రకృతి నుంచే అవసరమైన అన్ని పాఠ్య విషయాలను నేర్చుకునేటట్లు తగినన్ని ఏర్పాట్లు చేసాడు.మిగితాది రేపు....