నైతిక వికాస సూత్రాలు:--సాకి, కరీంనగర్.

11.
ఆపదవేళ ధైర్యము వహించు
సంపదవేళ ఓరిమి ధరించు
ఆపదలు కలకాలం ఉండవు
సంపదలు చిరకాలం ఉండవు
12.
కంఠస్థమున్న విద్య ఉపయోగకరం
చేతినందున్న ధనం ప్రయోజనకరం
విద్యాధనం పొందుట విస్మరించకు
పదుగురికి పంచటం తిరస్కరించకు
13.
స్వవేషం మనిషికి భూషణం
స్వభాష మాటకి భూషణం
స్వదేశీ పౌరునికి అలంకారం
స్వదేశీ దేశానికి అలంకారం
14.
ఉత్తముని కోపం క్షణకాలం
మధ్యముని కోపం ఘడియకాలం
అధముని కోపం రేయీపగలు
ఉత్తముడవై కలకాలం మిగులు
15.
ప్రాణంపోయిన కర్తవ్యం పాటించు
కర్తవ్యంకొరకు చావునైనా స్వీకరించు
కర్తవ్యం ఒక్కటే కర్మవీరునిగజేయు
కర్తవ్యం ఒక్కటే ఉన్నతుడ్నిజేయు