గొంతు సమస్యలు -నివారణలు -- పి . కమలాకర్ రావు

 వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల, చల్లని గాలుల వల్ల రకరకాల గొంతు సమస్యలు వచ్చి మనం ఆహారం తినేటప్పుడు ఇబ్బంది పెడుతుంటాయి గొంతు నొప్పి గొంతులో గర గర మొదలైనవి మనను ఫ్రీ గా మాట్లాడకుండా చేస్తాయి. కొద్దిగా వాముని వేడి నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు గొంతులో పోసుకుని గరఁగ్లింగ్ చేయాలి. గొంతు నొప్పి తగ్గిపోతుంది పసుపు సైంధవ లవణం తో కూడా ఇలాగే చేయవచ్చు. పటిక ముక్కను తెచ్చి పెనంపై వేసి వేడి చేయాలి ఆ తర్వాత పొడి చేసుకోవాలి అరగ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి నోట్లో పోసుకొని పుక్కిలించాలి. గొంతుకు సంబంధించిన అన్ని జబ్బులు తగ్గిపోతాయి. కొద్దిగా అతిమధురం పొడిని నీటిలో వేసి మరిగించి చల్లార్చి దాదాపు అర కప్పు త్రాగాలి. గొంతు సమస్యలు అన్ని తగ్గిపోతాయి. ఒకవేళ గొంతు మూసుకుపోయి మాట్లాడు లేకపోతే కొద్దిగా మిరియాల పొడి ని తేనెలో కలిపి నా కించాలి. కొద్ది గంటలలోనే మాట్లాడగలుగుతారు. జామాకుల కషాయం కూడా గొంతు సమస్యలను తగ్గిస్తుంది.