బాలల్లారా
భవితకు వారసులారా
నవ శకానికి నడకలు మీవే
నవ్వుల పూలు పూసే ప్రతిచోటు మీదే
బుడిబుడి అడుగులు
వాడని పరిమళాలు
మీ నవ్వులు
చైతన్యానికి చిరునామా
చరితకు వారసులు మీరే
జలజల పారే జలపాతం
మీ పెదాలపై చిరునవ్వు
వేలిగే సూర్యుని వెలుగే మీరు
కలతలేని చల్లని వెన్నెల
మీ మనసు
అన్ని నేర్చగా ఆనందంతోడుగా
జ్ఞానామృతం పొందగా
నువ్వెదగాలి
జగతిన నీ జాడలు
వికసించాలి
ఆటలలో పాటలలో
మాటలలో
మానవత్వం నింపుకొని
మనిషిగా నువ్వే ఎదగాలి
బాలల్లరా-భవితకువారసులరా--సి. శేఖర్(సియస్సార్),-తెలుగు భాషోపాద్యాయులు,-పాలమూరు,-9010480557.