అమ్మభాష----సి. శేఖర్(సియస్సార్),తెలుగు భాషోపాద్యాయులు,పాలమూరు,9010480557.

అమ్మనేర్పిన భాష
అందమైన భాష
ఆనందమందించు భాష
ఆలోచనలో మన భాష
అమ్మ ప్రేమ పంచు భాష
ఆత్మీయత అనురాగం
అనుబంధం ఆలంబన
మనకిచ్చు మదిపంచు
మనసులో పదిలమైనది
ఏ చోటైనా ఏపూటైనా
మాటాడు గర్వంగా
మనభాష వెలుగొంద
పుడమిపై విరియగా
వాడని పరిమళంగా
మన తెలుగు నిలపగా