దసరా పండగ - బాల సాహిత్యం-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్:9290061336

దసరా గీతాలలో అనేక మైన ఇంపు   సొం పైన బాలలు పాడే గీతాలు ఉన్నాయి. ఇక విద్య ను గురించి స్తోత్రం ఉంది. ముద్దులొలికే బాల గొంతు నుండి లలిత పదాల సరళి వర్ణనాతీతం.
    విద్య స్తోత్రం:-
    వినరయ్య జెప్పెదను వినయంబుగాను/  మా ఇళ్ళలో మేము చిన్న బాలురము/ఆడుచుండగ అయ్యవారు వచ్చి/తల్లిదండ్రులను గని తగు 
విచారించి/నాకు విద్యలు చెప్పి... ఈ స్తోత్రంతో పాటు  గురుదక్షిణ అడిగే రీతి చక్కగ వర్ణించబడింది. బాలలందరు కూడి ,బృంద గానం చేస్తే మృదుమధురంగా ఉంటూ, ఆలకించే వారికి వినసొంపుతో పాటు ఆనందం కలిగించేది.  
నారాయణ స్తోత్రం:-
    ఈ స్తోత్రం బాలలు చదివితే ఎంతటి కఠిన చిత్తుల కైన ఆనందం కలిగి బాలలకు పప్పు బెల్లాలు కానుకగా ఇచ్చే సత్యకాలం రోజులవి.
"ధర సింహాసనమై నభంబు గొడుగై/తద్దేవతల్ భృత్యులై/వరమామ్నాయములెల్ల వంది గణమై/
బ్రహ్మాండమాకాశమై/సిరి భార్యామణియై, విరించి కొడుకై/శ్రీ గంగ  సత్పుత్రియై  ,/వరునన్ని ఘనరాజ నంబు నిజమై వర్ధిల్లు నారాయణ// జయజయా//
      బాలల దీవెనలు బ్రహ్మ దీవెనలుగా శతశాతం భావించే రోజులవి. అందుకే  ఎంత గొప్ప వారైను బాలలను ఇంటికి రప్పించి, పాటలు పాడించేవారు. అమితమైన ఆనందం పొందే వారు. పిల్లలందరికీ పప్పు బెల్లాలు పంచి, బాలల ముఖారవిందాలలో ఆనందం చూసి మానసికమైన ఆనందం పొందే వారు.
"ఆ ఆనందమే మానసిక ఆరోగ్యానికి మూలం కదా!
             "పప్పు బెల్లముల పద్యం
 ఇంచుమించుగ బాలలు చిట్ట చివరగా పాడే గీతం.
 ‌బాలల పాడే ఈ చివర గీతంలో కూడా ప్రత్యేకత ఉందని చెప్పు కొనుట నిర్వివాదాంశం:
"ఏ దయా మీ దయా మా మీద లేదు/ఇంతసేపుం చుట ఇది మీకు తగునా/దసరాకి వస్తిమని
విసవిసలు పడక/రేపు రా!మాపు రా! మళ్లీ రమ్మనక/చేతిలో లేదనక అప్పివ్వరనక/ ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మీ/ గొప్పగా చూడండి తప్పక మీరు/పావలా బేడయితే పెట్టేదిలేదు/అర్ధరూపాయిస్తే అంటేది లేదు/ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు/హెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము/పై పావలా మాకు పప్పు బెల్లాలు/
శీఘ్రమే పంపుడి శ్రీమంతులారా//జయ జయా//
    రూపాయి ఇస్తే చూసి, సంతోషించే కాలం, అంతేకాదు పావలా పప్పు బెల్లాలు బాలలందరికీ చేతి నిండా పెట్టీ పంచే రోజులు.రూపాయికి మరియు
పావులాకు విలువ ఎంతటిదో నాడు! ద్రవ్యోల్బణం
లేదు, పిల్లలు పప్పు బెల్లాలు సంతోషంగా తినేవారు.
దసరా కట్నాలు పొందుగా గురువులు పంచు కునే వారు. ఈ పాటల్లో పొగడ్తలు కూడా ఉండేవి.
 "శ్రీమంతులై మహా శ్రేయములు గలిగి /భూమిలో వెలలేని భోగములు గలిగి/ ధన ధాన్యములు గలిగి/ ధర్మంబు గలిగి/ఘన వస్తువు గజ హయ వ్రాతంబు గలిగి/అందలంబులు గలిగి అతి వేడ్కతోను/ 
 పొందైన నవరత్న భూషణములు గలిగి/ మన్నించు రాజు వలె మర్యాద గలిగి/తనయులకు తనయులు
తనయులును గలిగి/మనుమలకు మనమలు మనమలును గలిగి/వన్నెవాసియు గలిగి వర్ధిల్ల రయ్య //జయ జయా//
    ఇవిగాక "మెప్పించు పాట" "మందలింపు పాట" "దసరా వర్ణనము" అంతేకాదు "రైలు బండి - గుర్రపు పందెం"మరియు"తాటి చెట్టు - కొబ్బరి చెట్టు: సంవాదం" వంటి అనేక పాటలు ఉండేవి. వాటి నన్నిటిని నేర్పి బాలలచే ఆనాడు  ఉపాధ్యా యులు పాడించేవారు.
        అంతేకాదు ఉపాధ్యాయులు బాలలతో దసరా గీతాలలో తగిన శిక్షణ ఇచ్చేవారు. ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకునేవారు. శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే సరికి వాడవాడలా ఈ పాటలతో మారుమ్రోగేవి. పేద ధనిక ధ్యాస    లేకుండా పిల్లలు కలసిమెలసి తిరిగేవారు. మేధావులు కూడా బాలలచే తమ ముంగిట పాటలు పాడించి, గురువులను సత్కరించేవారు. బాలలకు మిఠాయిలు కానుకగా ఇచ్చి, దసరా పాటలు పాడించుకునేవారు. అటువంటి బాలల దసరా పండుగ, ఆ సాంప్రదాయం
పై నమ్మకం లేక ఉపాధ్యాయులకు దసరా మామూళ్ల
ని కొన్నేళ్లు సాగిన, ఆ తర్వాత ఉపాధ్యాయులే విరమించుకుని చాలాకాలమైంది. మధురమైన దసరా  పాటలు, ఈ బాలసాహిత్యం కాల గర్భంలో కలిసిపోయింది.
(దసరా నవరాత్రుల్లో బాలలు పాడే మధురమైన పాటలు అనేకం ఉన్నాయి గాని దసరా పండగ  ముగిసింది. కనుక ఈ వ్యాసం ఇంతటితో ముగిస్తున్నాను.)తదుపరి మరో వ్యాసంతో