తెలుగు (బాల) సాహిత్యము-దసరా పండుగ- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్ : 9290061336

దసరా నవరాత్రులలో ఉపాధ్యాయులు బాలలను
తోడ్కొని వీధులలో తిరుగుతు దసరా పద్యాలు పాడుతుంటే, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చూచి ఆనందించే రోజులవి.
    వంటింట్లో వంట పని చేస్తుండే మహిళలు కూడా బయటకు వచ్చి పిల్లల ఆనందం, తమ సొంత పిల్ల
లను చూసి మురిసిపోయినట్లు ఆనందించే  సత్య
కాలమది.
ఉపాధ్యాయులు,  పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లే ముందు  తల్లిదండ్రుల పంపే ఆహ్వానాన్ని అనుసరించి ఒక క్రమపద్ధతిలో వెళ్లేవారు. పిల్లలు కూడా "మా ఇంటికి రండి, మా నాన్నగారు మీకు పిల్లలను తీసుకొని రమ్మని మరి మరి చెప్పమన్నారు సార్,"అని బ్రతిమాలుతూ ఉపాధ్యాయులకు చెప్పేవారు.
ఆ రోజులలో బాలలు పాడిన దసరా గీతాలలో శ్రీకృష్ణుని ఆగడాలు గురించి పాడించే పాటలు అనేకం ఉన్నాయి. శ్రీ కృష్ణుని చిలిపి చేష్టలు గోపికలతో ఆడే
తీరును వర్ణిస్తూ ఒక గీతం, చెప్పుకుందాం
    వసుధను శ్రీకృష్ణ వనమాలి వినుమా/వసుదేవ నందన వాదు నీకేలా/కఠినముగా నీ మనసు కరి గింప లేము/పశుల కాపరివాడ బాగుగాదింక/
దోష మెన్నకరోరి దొరతనంబటరా/కొలను ఒడ్డున మేము కోకలను విడిచి/జలము నందున మేము
జలకమాడంగ/చాటు చాటున వచ్చి సన్న సన్నగను/
విడచిన చీరలు వడి మూట గట్టి/పొన్న వృక్షమునందు పొందుగా నుంచి/దాచుట నీకిది ధర్మంబు కాదు/ 
ఈ దసరా గీతాన్ని బాలలందరూ బృంద గానం చేస్తుంటే పెద్దలంత తన్మయత్వం చెంది తలలు ఆడిస్తూ, పరవశించే వారు. ఈ పాట విన్న అందరూ కూడా , కడకు"శభాష్"అని నోట వెంబడి అచేతనంగా
వచ్చేది.
     బాలలను ఆశీర్వదించమని స్తుతిస్తూ, విష్ణువు యొక్క దశావతార వర్ణన... ఈ దసరా గీతం:
మరు జనక మమ్మేలు మత్స్యావతార/ గురుతుగా కృప చూడు కూర్మావతార/వరదుడై వర్ధిల్లు వరాహావతార/శిశువును గాచిన నరసింహావతార/
వక్షమున సిరిగల్గు వామనావతార/బహు బలాఢ్య
బలభద్రావతార/బ్రోవ నేర్చిన యట్టి బుద్దావతార/
గావవే మము కలికావతార/ దివ్య సంపదలొసగు
దివ్యావతార/సేవకుల రక్షించు శేషావతార/బాలుర ను నేలు శ్రీ బాల గోపాల//
జయ జయా, జయ జయా, జయ మహా విజయ,//
   బాలలు పలికేందుకు సరళమైన పదాలతో కూర్చిన ది. పిల్లలు పాడుతుంటే దశావతారాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది కదా!   బాలలకు పరోక్షముగా దశావతారాలు పరిచయం అయ్యేవి. బాలలు పాడుతూ వినిపించే  విధానం,  రాగం ఒక ప్రత్యేక సంతృప్తిని కలిగిస్తుంది కదా!
       బాలల పాడే మరొక గీతం ఉంది, అందులో అంతర్లీనంగా తాత్విక దృక్పథం కూడ ఉంది:-
కట కటా, మీకెంత కరుణ లేదయ్యా/ఇటు వచ్చి యడుగ మాకిది పద్ధతయ్యా /మాటలకేమి మా పాట వినరయ్యా /పాటల సుధారసము పలుకు వినరయ్య
వాటముగా దీవింప వస్తిమీగదయ్యా/యేటేట మాకిది ఇహ పరం భయ్యా/మూట గట్టుట ఏమి మోహము గాదయ్యా/కోట్లార్జించిన కూటికే కదయ్యా/మటుమాయ వాదులను మరి అడుగ వయ్యా/నీటుగల శాల్జోడు నేడివ్వరయ్యా/సాటెవరు మీ తోనూ సరసము గదయ్యా//
//జయ జయా,జయ జయా! జయ మహా విజయా//
        ఈ గీతానికి సాధారణంగా అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు ఉపాధ్యాయులు. కొన్ని ఇళ్లలో వృద్ధులు తాత్విక దృష్టి కలవారు, తప్పనిసరిగా పాడించు కునేవారు.
     బాలలు గిలక పద్యం పాడుతుంటే వర్ణన రమణీయంగా ఉంటుంది.  అందరూ శ్రద్ధగా మైమరచిపోయి వినేవారు.
"చెలువైన చౌకల్లు చంద్రహారములు/మురుడీలు గొలుసులు ముద్దుటుంగ్రములు/పచ్చల పోగులు
ముద్దుతాళీలు,/కొమ్మంచు పంచెలు పొందైన పాగ/జలతారు వోళీలు , జేబు రుమాళ్లు, అంగీలు నడకట్లు, అదురుగా నగలు, తొడిగితిమి  ముస్తాబు తోటి గిలకలను // జయ జయా//
      ఈ పాటలో ఆనాటి సాంప్రదాయ దుస్తులు ఆభరణాలు ఎలా ఉండేవో, ఈనాడు మనకు
అర్థమోవుతుంది. ఐతే తెలుగువారలమైన మనం
 ఈ సాంప్రదాయాలని మరచిపోలేము.